2024 లో హైయెస్ట్ గ్రాస్ మూవీస్ ఇవే

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చిన సినిమాలలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న మూవీస్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ నిలిచింది.

Update: 2024-12-28 09:56 GMT

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చిన సినిమాలలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న మూవీస్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ నిలిచింది. ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ 1705 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంది. మూడు వారాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నాలుగో వారంలోకి అడుగుపెట్టింది.

ఇదే జోరు మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇక 2024 బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచిన ‘పుష్ప 2’ మూవీ ఖాతాలో చాలా రికార్డులు వచ్చి చేరాయి. ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న ఆల్ టైం సినిమాల జాబితాలో మూడో స్థానంలోకి ఈ మూవీ వచ్చింది. అలాగే హిందీలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా మరో రికార్డ్ ని కూడా ఈ సినిమా అందుకుంది.

బాలీవుడ్ లో ఆల్ టైం హిట్ సినిమాల జాబితాలో పుష్ప 2 స్థానం సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా డీసెంట్ కలెక్షన్స్ తో ప్రస్తుతం నడుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ‘కల్కి 2898ఏడీ’ మూవీ ఉంది. 1200 కోట్ల గ్రాస్ ని ఈ చిత్రం కలెక్ట్ చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ లోనే సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా ఈ మూవీ నిలిచింది.

అలాగే ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రంగా కూడా కల్కి మూవీ అరుదైన ఫీట్ అందుకుంది. నెక్స్ట్ఈ మూవీకి కొనసాగింపుగా రాబోతున్న ‘కల్కి పార్ట్ 2’ బడ్జెట్ కూడా 600 కోట్లపైనే ఉండబోతోందని తెలుస్తోంది.

ఇక ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూడో చిత్రంగా ‘స్త్రీ 2’ నిలిచింది. అలాగే ఈ ఏడాది అత్యధిక ప్రాఫిట్ అందుకున్న సినిమాగా ఈ చిత్రం మరో రికార్డ్ ని అందుకుంది. కేవలం 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఏకంగా 874.58 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఇక ఓవరాల్ గా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితా చూసుకుంటే ఇలా ఉంది.

పుష్ప 2: ది రూల్ - ₹1,705 కోట్లు

కల్కి 2898ఏడీ - ₹1,200 కోట్లు

స్త్రీ 2: - ₹874.58 కోట్లు

GOAT - ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ - ₹456 కోట్లు

దేవర: పార్ట్ 1 - ₹521 కోట్లు

భూల్ భులయ్యా 3 - ₹417.51 కోట్లు

సింగం అగైన్ - ₹389.64 కోట్లు

ఫైటర్ - ₹344.46 కోట్లు

అమరన్ - ₹335 కోట్లు

హనుమాన్ - ₹350 కోట్లు

Tags:    

Similar News