ఒక్క ఏడాదిలోనే చాలా కోట్ల నష్టం!
ఇదిలా ఉంటే తాజాగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ ఏడాది తన ప్రొడక్షన్ నుంచి వచ్చిన సినిమాలు, వాటి ఫలితం నష్టాలపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో చిన్న చిత్రాల నుంచి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ వరకు బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తోన్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వడంతో పాటు కమర్షియల్ దర్శకులతో కూడా కాంబినేషన్స్ మీద విశ్వప్రసాద్ మూవీస్ చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి 'ఈగల్', 'మనమే', 'మిస్టర్ బచ్చన్', 'విశ్వం', 'స్వాగ్', 'నరుడి బ్రతుకు నటన' సినిమాలు వచ్చాయి.
వీటిలో ఏ ఒక్కటి కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. మనమేకి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ కావడంతో నష్టాలు తప్పలేదు. ఈ సినిమా ఓటీటీలో ఇంకా రిలీజ్ కాలేదు. ఏవో వివాదాల కారణంగా ప్రాజెక్ట్ డిజిటల్ రిలీజ్ హోల్డ్ లో పడింది. ఈ సినిమాలన్నింటిని భారీ బడ్జెట్ తోనే టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అయితే ఊహించని స్థాయిలో నష్టాలని తీసుకొచ్చాయి. డిజిటల్ రైట్స్ వలన కొంత సేఫ్ అయ్యారనే మాట వినిపించింది.
ఇదిలా ఉంటే తాజాగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ ఏడాది తన ప్రొడక్షన్ నుంచి వచ్చిన సినిమాలు, వాటి ఫలితం నష్టాలపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నిర్మాత గా చాలా కోట్ల నష్టం సినిమాల నిర్మాణం ద్వారా వచ్చిందని బోల్డ్ గా ప్రకటించారు. ఈ ఏడాదిలోనే అత్యధికంగా లాస్ వచ్చిందని కన్ఫర్మ్ చేశారు. ఇండస్ట్రీలో బడా నిర్మాతలు ఎవరు కూడా ఇప్పటి వరకు ఈ రకంగా ఫైనాన్సియల్ లాస్ గురించి బహిరంగంగా ప్రకటించలేదు.
అయితే విశ్వప్రసాద్ మాత్రం భారీ నష్టాలు వచ్చినట్లు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ నష్టాల కారణంగా కొన్ని ప్రాజెక్ట్స్ హోల్డ్ చేసినట్లు తెలిపారు. అయితే వచ్చే ఏడాది రాబోయే సినిమాలతో మరల బౌన్స్ బ్యాక్ అవుతామని విశ్వప్రసాద్ చెప్పారు. ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉంటే 2025లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ప్రభాస్ 'ది రాజాసాబ్' ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అలాగే తేజ సజ్జా 'మిరాయ్', సిద్ధూ జొన్నలగడ్డ 'తెలుసు కదా' సినిమాలు భారీ బడ్జెట్ చిత్రాలుగానే రిలీజ్ కాబోతున్నాయి. దాంతో పాటు అడివి శేష్ 'గూఢచారి 2 కూడా వచ్చే ఏడాది రానుంది. అలాగే 'మహాకాళి' అనే సినిమా రిలీజ్ కానుంది. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా 'జాట్' అనే మూవీని మైత్రి వారితో కలిసి 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.