'ఓజీ' ఇండస్ట్రీ హిట్ గ్యారెంటీ!

దర్శకుడు సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజీ" సినిమా పై అంచనాలు మరింత ఉన్నాయి.

Update: 2024-10-05 04:20 GMT

పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు మొదలు పెట్టిన సినిమాల్లో హరి హర వీరమల్లు, ఓజీ సినిమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. ఉస్తాద్‌ భగత్ సింగ్ మాత్రం ఒక్క షెడ్యూల్‌ ను మాత్రమే పూర్తి చేసుకుంది. కనుక రాజకీయాలతో, ఉప ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా ఆ రెండు సినిమాలను పవన్‌ కళ్యాణ్ ముగించాల్సి ఉంది. ఇటీవలే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌ ను పునః ప్రారంభించారు. పవన్‌ కళ్యాణ్‌ క్యాంప్ ఆఫీస్ పక్కనే ఏర్పాటు చేసిన సెట్స్ లో వీరమల్లు పోరాటాలు షూట్‌ చేశారని సమాచారం అందుతోంది.

ఇక సాహో దర్శకుడు సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమా పై అంచనాలు మరింత ఉన్నాయి. పవన్ కి ఇష్టమైన కాన్సెప్ట్‌, ఈ మధ్య కాలంలో హిట్ కాన్సెప్ట్‌ గా పేరు దక్కించుకున్న మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఓజీ సినిమా ఎప్పుడు ఎప్పుడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓజీ సంగీత దర్శకుడు అయిన థమన్‌ ను చాలా మంది అప్‌డేట్‌ ప్లీజ్ అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఎట్టకేలకు థమన్‌ నుంచి ఓజీ కి సంబంధించిన మరో అప్‌డేట్‌ వచ్చింది. తాజాగా ఆయన ఒక ట్వీట్‌ లో ఓజీ కచ్చితంగా ఇండస్ట్రీ హిట్‌ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.

థమన్‌ ట్విట్టర్ లో స్పందిస్తూ... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కే కాకుండా ప్రతి ఒక్కరికీ ఓజీ ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి ఉంది. సినిమా కచ్చితంగా ప్రతి ఒక్కరు మెచ్చే విధంగా ఉంటుంది. దర్శకుడు సుజీత్‌ అద్భుతంగా ఓజీని రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌ గా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రస్తుతం బిగ్‌ అప్డేట్‌ ఇవ్వడం కోసం వర్క్‌ చేస్తున్నారు. త్వరలోనే ఫ్యాన్స్ కోసం ఓజీ నుంచి బిగ్‌ అప్‌డేట్‌ వస్తుంది అనే నమ్మకంను థమన్‌ చేశారు. అంతే కాకుండా ఓజీ సినిమా విడుదల తేదీ విషయంలోనూ అతి త్వరలోనే స్పష్టత వస్తుందని ఆయన మాటల ద్వారా అర్థం అవుతుంది.

పవన్ కళ్యాణ్‌ కి జోడీగా ఓజీ సినిమాలో ప్రియాంకర అరుల్‌ మోహన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్‌ స్టార్‌ తో పాటు తమిళ నటి శ్రియా రెడ్డి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి వచ్చిన అప్డేట్స్, లుక్స్ తో అంచనాలు పెరిగాయి. పవన్‌ కళ్యాణ్ ను చాలా విభిన్నంగా చూపిస్తాను అంటూ దర్శకుడు సాహో సుజీత్‌ పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. అందుకే సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ కారణంగానే ఎప్పుడు ఎప్పుడు సినిమా విడుదల అవుతుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది దసరా లేదా ముందే ఓజీ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Tags:    

Similar News