మహేష్ ఫ్యాన్స్ కోసం థమన్ ట్రీట్.. గెట్ రెడీ
ఫ్యామిలీ ఆడియన్స్, మహేష్ ఫ్యాన్స్ ని తప్పితే నార్మల్ ఆడియన్స్ నుంచి డివైడ్ టాక్ వచ్చింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజ్ కు ముందు ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసుకుంది. లాంగ్ గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ - మహేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే రిలీజ్ తర్వాత సినిమాకి ఆశించిన రెస్పాన్స్ రాలేదు.
ఫ్యామిలీ ఆడియన్స్, మహేష్ ఫ్యాన్స్ ని తప్పితే నార్మల్ ఆడియన్స్ నుంచి డివైడ్ టాక్ వచ్చింది. కానీ సినిమాలో మహేష్ మాస్ లుక్, క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, సాంగ్స్, డాన్స్.. అలా అన్నీ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాయి. దాంతో టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా ఇప్పటికే 200 కోట్లకి పైగా గ్రాస్ అందుకొని అత్యధిక కలెక్షన్స్ అందుకున్న రీజనల్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
రిలీజ్ కు ముందు ఈ సినిమా కోసం తమన్ కంపోజ్ చేసిన చేసిన సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ముఖ్యంగా దమ్ మసాలా, కుర్చీ మడత పెట్టి వంటి పాటలు మహేష్ ఫ్యాన్స్ ని ఫలితంగా ఆకట్టుకున్నాయి. విజువల్ గానూ థియేటర్స్ లో ఫ్యాన్స్ కి మంచి ఊపు తెప్పించాయి. ఇక ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సినిమా నుంచి కేవలం మహేష్ ఫ్యాన్స్ కోసం థమన్ ఓ సాంగ్ రెడీ చేస్తున్నారట.
ఇదే విషయాన్ని తమన్ తాజాగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గుంటూరు కారం కోసం తమన్ ఆరు పాటలను కంపోజ్ చేశాడు. ఇక త్వరలోనే ఏడవ పాటను యాడ్ చేయబోతున్నట్లు పేర్కొన్నాడు. "గుంటూరు కారం నుంచి త్వరలో మరోసారి సాంగ్ యాడ్ చేయబోతున్నాం ఈ సాంగ్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఎంతో స్పెషల్ గా ఉంటుంది. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ ఇదే నా ప్రామిస్" అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. దీంతో థమన్ చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ట్వీట్స్ చూసిన మహేష్ ఫ్యాన్స్ ఆ సాంగ్ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక గుంటూరు కకారం విషయానికొస్తే.. ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీ లీల హీరోయిన్గా నటించింది. మరో మీనాక్షి చౌదరి మహేష్ మరదలి పాత్రలో కనిపించింది. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, జయరాం కీలక పాత్రలు పోషించారు హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.