తండేల్ మ్యాజికల్ మ్యూజిక్.. హ్యాట్రిక్ సూపర్ హిట్స్!

ఈసారి కథను మరింత స్ట్రాంగ్ గా, విభిన్నమైన నేపథ్యంతో తెరకెక్కించారు. ఇక మ్యూజిక్ విషయంలో తండేల్ టీం పర్ఫెక్ట్‌గా హిట్ కొట్టింది.

Update: 2025-01-24 17:50 GMT

తండేల్ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా పక్కా హిట్టు బొమ్మ అని హింట్ ఇస్తోంది. 2021లో వచ్చిన లవ్ స్టోరీ తర్వాత వీరి కలయికలో వస్తున్న మరో సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈసారి కథను మరింత స్ట్రాంగ్ గా, విభిన్నమైన నేపథ్యంతో తెరకెక్కించారు. ఇక మ్యూజిక్ విషయంలో తండేల్ టీం పర్ఫెక్ట్‌గా హిట్ కొట్టింది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఇప్పటికే విడుదలైన మూడు పాటలు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఈ మూడు పాటలు ఇప్పటికే స్మాషింగ్ హిట్స్‌గా నిలిచాయి. ఒక్కో పాటతో ప్రేక్షకుల్ని కొత్త ఉత్సాహంతో మైమరిపించారు. ఈ పాటలు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఇక పూర్తి ఆల్బమ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

సినిమాకు సంబంధించిన మొదటి పాట బుజ్జి తల్లి రెండు నెలల క్రితం విడుదలైంది. ఈ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో 55 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించి, ప్రేక్షకుల ప్లేలిస్టుల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. ఇది పూర్తిగా క్లాసిక్ డిఎస్‌పి శైలిని గుర్తు చేస్తూ, సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఆ పాటలో సాయి పల్లవి, నాగచైతన్య జంట కెమిస్ట్రీ మరోసారి మాయ చేయడం విశేషం.

Full View

రెండో పాట నమో నమః శివాయ రెండువారాల క్రితం విడుదలైంది. ఇది శివుడిపై ఉన్న ఎనర్జిటిక్ భక్తిరసంతో కూడిన పాట. ఇప్పటికే 8 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ పాట, దేవిశ్రీ ప్రసాద్ మరోసారి శివ భక్తులకు అద్భుతమైన గీతాన్ని అందించాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేవి దేవోషనల్ సాంగ్స్ ఇస్తే మామూలుగా ఉండదని మరోసారి నిరూపించారు. గతంలో పౌర్ణమి, డమరుకం సినిమాలకి అదిరిపోయే శివ భక్తి సాంగ్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Full View

తాజాగా విడుదలైన మూడో పాట హైలెస్సా హైలెస్సా మరో సౌల్ఫుల్ మెలోడీగా అందరినీ ఆకట్టుకుంది. ఈ పాట విడుదలైన 24 గంటల వ్యవధిలోనే 1 మిలియన్ వ్యూస్ సాధించి, ప్లేలిస్టుల్లో టాప్ ప్లేస్ అందుకునే దిశగా దూసుకుపోతుంది. ఇందులో మ్యూజిక్ విన్నప్పుడే మిగతా పాటల కంటే భిన్నంగా అనిపిస్తుంది. ఈ మూడు పాటల విజయాలతో తండేల్ సినిమా ఇప్పటికే భారీ హైప్‌ను సాధించింది.

Full View

ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం మరింత అంచనాలు పెంచుతోంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించారు. ఏకంగా మూడు పాటలు బ్లాక్‌బస్టర్ కావడం ఇటీవలి కాలంలో ఒక అరుదైన అంశం. మిగిలిన పాటలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News