తండేల్: ఇక ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే..?

ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే మ్యూజిక్ ఛార్ట్స్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

Update: 2025-01-25 11:36 GMT

తండేల్ చిత్రానికి సంబంధించి ప్రతీ చిన్న అప్డేట్ కూడా ఫ్యాన్స్ లో మంచి హైప్ క్తియేట్ చేస్తోంది. అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ భారీ చిత్రం విడుదలకు దగ్గరపడుతుండటంతో, ట్రైలర్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, గ్లింప్స్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే మ్యూజిక్ ఛార్ట్స్‌లో ట్రెండ్ అవుతున్నాయి.


తాజాగా, చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. జనవరి 28న తండేల్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రకటనతో పాటుగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో నాగచైతన్య మాస్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. అతని చేతిలో రక్తంతో తడిసిన బకెట్ ఉండటంతో, సినిమాలోని భావోద్వేగం, ఇంటెన్సిటీ పై మరోసారి హైప్ పెరిగింది.

చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, వారి కెమిస్ట్రీ లవ్ కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే ఈ జంటకి ఉన్న క్రేజ్ కారణంగా, ప్రేక్షకులు ఈ సినిమాలో వారి కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బన్నీ వాసు నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. సినిమాకు సంబంధించి ప్రతి చిన్న అప్‌డేట్ కూడా ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహం రేపుతోంది. తండేల్ అనేది కేవలం ఒక సినిమా కాదు, ఇది ప్రేక్షకుల హృదయాలను తాకేలా సరికొత్త ఎమోషనల్ రైడ్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇక సినిమాను వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో ఫిబ్రవరి 7న రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ విడుదల తరువాత సినిమా మీద మరింత ఆసక్తి, అంచనాలు పెరగడం ఖాయం. ఈ సినిమా రొమాంటిక్ ఎమోషన్స్‌తో పాటు మాస్ యాక్షన్‌ను కూడా కలిపి ఒక ప్రత్యేక అనుభూతిని కలిగించేలా ఉంటుందని దర్శకుడు చందూ మొండేటి పేర్కొన్నారు. ఇక జనవరి 28న ట్రైలర్ విడుదలవుతుందన్న ఆనందంలో ఉన్న అభిమానులు, సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి తండేల్ ట్రైలర్ అంచనాల స్థాయిని ఇంకా ఏ రేంజ్ లో పెంచుతుందో చూడాలి.

Tags:    

Similar News