బాక్సాఫీస్.. అనుకున్నంత సౌండ్ లేదు టిల్లు?
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. డీజే టిల్లుకి సీక్వెల్ గా సిద్ధమైన ఈ మూవీ మార్చి 29న థియేటర్స్ లోకి వస్తోంది. డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో టిల్లు స్క్వేర్ పైన కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో బోల్డ్ క్యారెక్టర్ లో నటించడం కూడా మూవీకి అదనపు అస్సెట్ అని చెప్పాలి.
ఇక ఎలాగూ సిద్దు చేస్తోన్న టిల్లు క్యారెక్టర్ కామెడీ హంగామా సినిమాలో ఉండనే ఉంటుంది. టీజర్, సాంగ్స్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందిని.. దీంతో కచ్చితంగా టిల్లు స్క్వేర్ కి భారీ ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ అని చిత్ర యూనిట్ అంచనా వేసింది. మూవీ థీయాట్రికల్ రైట్స్ ని భారీ ధరకి ఏరియాల వారీగా బయ్యర్లు సొంతం చేసుకున్నారు. అలాగే డిజిటల్ రైట్స్ రూపంలో ఏకంగా 30 కోట్లు మూవీకి ముందే వచ్చేశాయి.
ఈ లెక్కల బట్టి టిల్లు స్క్వేర్ కి ఎంత మంచి బిజినెస్ జరిగిందనేది అంచనా వేయవచ్చు. కచ్చితంగా సిద్దు కెరియర్ లో ఓ మంచి సినిమా అవుతుందని భావిస్తున్నారు. కానీ సినిమాపై ఉన్న హైప్, ఎక్స్ పెక్టేషన్స్ కి తగ్గట్లుగా ప్రస్తుతం బుకింగ్స్ లేవని తెలుస్తోంది. నిజానికి ఈ మూవీకున్న బజ్ తో మూడు రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతూ ఉంటాయి.
అయితే టిల్లు స్క్వేర్ కి ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదనే మాట వినిపిస్తోంది. హైదరాబాద్ లో కేవలం 83 లక్షల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు వసూళ్లు అయ్యాయి. సినిమా రిలీజ్ కి ఇంకా ఒక్క రోజు మాత్రమే టైం ఉంది. అయితే తక్కువ స్థాయిలో బుకింగ్స్ జరగడంతో ఓపెనింగ్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుననే మాట వినిపిస్తోంది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మీద పాజిటివ్ వైబ్ క్రియేట్ అయితే అడ్వాన్స్ బుకింగ్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సిద్దు నుంచి వస్తోన్న మూవీ, ట్రైలర్ లో కాస్తా బోల్డ్ సీక్వెన్స్ చూపించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి తక్కువ రెస్పాన్స్ వస్తోంది. ఎక్కువగా టీనేజ్ యూత్ మాత్రమే టిల్లు స్క్వేర్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కూడా నిర్మాతలు ఎక్స్ పెక్ట్ చేసే స్థాయిలో అడ్వాన్స్ లేకపోవడానికి మరో కారణం అనే టాక్ వస్తోంది.