మోస్ట్ వాంటెడ్ లేడీ యానిమల్..!
ఆ సినిమాలో త్రిప్తి, డిమ్రిల రొమాంటిక్ సీన్స్ వల్ల సినిమా హైలైట్‌గా నిలిచింది. అందుకే జనాలు, ప్రేక్షకులు, సినిమా వారు అంతా త్రిప్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు.
రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించింది. సినిమాలోని గీతాంజలి పాత్రను పోషించిన రష్మిక మందన్నకి మంచి స్క్రీన్ స్పేస్ లభించడంతో పాటు, నటనకు మంచి ఆస్కారం దక్కింది. రష్మిక తన సత్తా చాటింది. అయినా యానిమల్ సినిమాలో కొద్ది సమయం మాత్రమే కనిపించే త్రిప్తి డిమ్రీ మెయిన్ హైలైట్‌గా, లేడీ లీడ్‌గా నిలిచారు. ఆ సినిమాలో త్రిప్తి, డిమ్రిల రొమాంటిక్ సీన్స్ వల్ల సినిమా హైలైట్‌గా నిలిచింది. అందుకే జనాలు, ప్రేక్షకులు, సినిమా వారు అంతా త్రిప్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు.
త్రిప్తి డిమ్రి యొక్క అందాల ఆరబోత కంటిన్యూ అవుతోంది. యానిమల్ హిట్ తర్వాత ఒక్కసారిగా త్రిప్తి యొక్క కెరీర్ గ్రాఫ్ మారిపోయింది. తన యొక్క అందాల ఆరబోత ఫోటోలు సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా వైరల్ కావడం మొదలుకుని ప్రతి విషయంలోనూ ఆమె గురించి జనాలు మాట్లాడుకోవడంతో ఎక్కువ సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ ఉంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఈ అమ్మడు నిలిచింది అనడంలో సందేహం లేదు. 2024లో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు 2025లో అంతకు మించి సినిమాలతో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ ఏడాది ఈమె నటించిన భూల్ భులయ్యా, విక్కీ విద్యా కా వో వాలా వీడియో , బాడ్ న్యూజ్ సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అందుకే ఈమెకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల ఈమె ఫహద్ ఫాజిల్‌తో ఒక సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత రెండేళ్లలలో ఈమె గ్రాఫ్ అనూహ్యంగా పెరిగి పోయింది. ఒకప్పుడు ఆఫర్ల కోసం ఎదురు చూసిన తృప్తి ఇప్పుడు మరో రేంజ్‌లో దూసుకు పోతుంది. బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ ఈ అమ్మడు నటించే అవకాశాలు ఉన్నాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
త్రిప్తి డిమ్రీ సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. చాలా తక్కువ సమయంలోనే ఈ అమ్మడి ఇన్‌స్టా ఫాలోవర్స్ సంఖ్య 5 మిలియన్‌లు పెరగడం జరిగింది. ఏడాది కాలంలో ఈ స్థాయిలో ఇన్‌స్టా ఫాలోవర్స్‌ను దక్కించుకోవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ముందు ముందు బాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోయిన్‌గా ఈ అమ్మడు కనిపించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది రణబీర్ కపూర్, సందీప్ వంగల యానిమల్ పార్క్‌లో ఈమె పాత్ర ఎలా ఉంటుంది అని అంతా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. మొదటి పార్ట్‌లో చనిపోయినా యానిమల్ పార్క్‌లో ఆమె పాత్ర ఉంటే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.