యానిమల్ పిల్ల అస్సలు తగ్గట్లే..

ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న త్రిప్తి ఏకంగా 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది.

Update: 2024-09-16 04:11 GMT

'యానిమల్' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ త్రిప్తి దిమ్రి. ఈ బ్యూటీ 'యానిమల్' కి ముందు ఐదు సినిమాలలో నటించింది. అయితే వాటిలో ఏ ఒక్క సినిమాకి ఆమెకి గుర్తింపు తీసుకురాలేదు. 'యానిమల్' చిత్రంలో ఆమె క్యారెక్టర్ నిడివి తక్కువే అయిన కూడా బోల్డ్ గా నటించి మెప్పించింది. దీంతో 'యానిమల్' సినిమా తర్వాత ఆమె పేరు బిటౌన్ లో గట్టిగా వినిపించడం మొదలైంది.

బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో త్రిప్తి ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కేటగిరీలోకి వెళ్ళిపోయింది. 'యానిమల్' తో రష్మిక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకుంటే త్రిప్తి డిమ్రి ఆ ఛాన్స్ కొట్టేసింది. రీసెంట్ గా ఆమె విక్కీ కౌశల్ కి జోడీగా 'బ్యాడ్ న్యూస్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.

రాజ్ కుమార్ రావుకి జోడీగా 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో'లో చేస్తోంది. కార్తిక్ ఆర్యన్ లీడ్ రోల్ లో టి-సిరీస్ లో తెరకెక్కుతోన్న 'భూల్ భూలయ్య 3' మూవీలో త్రిప్తి ఛాన్స్ కొట్టేసింది. అలాగే కరణ్ జోహార్ నిర్మిస్తోన్న 'ధడక్ 2'చిత్రంలో కూడా త్రిప్తి మెయిన్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది. ఇవన్ని పెద్ద బ్యానర్స్ నుంచి వస్తున్న సినిమాలే కావడం విశేషం.

ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న త్రిప్తి ఏకంగా 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. బాలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లలో దీపికా పదుకునే మొదటి స్థానంలో ఉంది. తరువాత కంగనా రనౌత్, అలియా భట్, శ్రద్ధా కపూర్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు త్రిప్తి డిమ్రి కూడా తన రెమ్యునరేషన్ తో టాప్ హీరోయిన్స్ జాబితాలోకి వచ్చేసిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

త్రిప్తి తెలుగులోకి తీసుకురావడం కోసం చాలా మంది దర్శక, నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఆమె రెమ్యునరేషన్ ని ఎంత వరకు బేర్ చేయగలరనేది చెప్పలేం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప ది రూల్' సినిమాలో ఐటెం సాంగ్ కోసం త్రిప్తి సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఆమె కన్ఫర్మ్ అయినట్లు మేకర్స్ ప్రకటించలేదు.

Tags:    

Similar News