గోడ పక్కన కూర్చోవొద్దు అన్నా వినడం లేదా!
ఇటు నటుడిగా బిజీగా ఉంటూనే రాజకీయాలు చూస్తున్నాడు. ప్రస్తుతం నటిస్తోన్న 69వ చిత్రం `జన నాయగన్` తర్వాత సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడు.
తలపతి విజయ్ కోలీవుడ్ లో ఎంత పెద్ద హీరో చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించిన స్టార్ అతడు. తెలుగులో పవన్ కళ్యాణ్ ఎంత ఫేమస్సో...తమిళనాడులో విజయ్ అంతటి సంచలనం. ఇప్పటికే అతడు నటించిన సినిమాలెన్నో 500 కోట్ల వసూళ్లు తెచ్చిన సందర్భాలెన్నో. ఇటీవలే రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టాడు. ఎన్నికల బరిలోనూ నిలిచాడు. వచ్చే ఎన్నికల్లో గెలిచి సీఎం అవ్వాలని చూస్తున్నారు.
ఇటు నటుడిగా బిజీగా ఉంటూనే రాజకీయాలు చూస్తున్నాడు. ప్రస్తుతం నటిస్తోన్న 69వ చిత్రం 'జన నాయగన్' తర్వాత సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. ఆ తర్వాత రాజకీయంలోనే బిజీ అవుతాడు. ఇలా నటుడిగా ...నాయకుడిగా ఉన్న విజయ్ చాలా సైలెన్స్ అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతడు పెద్దగా ఎవరితోనూ మాట్లాడడట. షూటింగ్ సయయంలో షాట్ అయిన వెంటనే ఒంటరిగా కూర్చుంటాడట.
అదీ ఎవరూ లేని ప్లేస్ చూసుకుని ఎక్కడో ఉన్న గోడ పక్కన ఎవరికీ కనిపించకుండా కూర్చుంటాడట. ఈ విషయాన్ని త్రిష రివీల్ చేసింది. అలా గోడ పక్కన కూర్చోవద్దని..తన పద్దతి మార్చుకోవాలని త్రిష సలహా ఇచ్చినట్లు తెలిసింది. త్రిష-విజయ్ బాల్య స్నేహితులు. ఒకే స్కూల్..ఒకే కంచం అన్నంతగా క్లోజ్. ఇద్దరు కలిసి కొన్ని సినిమాలు కూడా చేసారు. చివరిగా లియోలో నటించారు. ఆ తర్వాత మళ్లీ కలిసి నటించలేదు.
ప్రస్తుతం విజయ్ హీరోగా హెచ్. వినోధ్ దర్శకత్వంలో `జన నాయగన్` తెరకెక్కుతోంది. ఇది రాజకీయ నేపథ్యమున్న సినిమా. ఎన్నికల బరిలో ఉన్న నేపథ్యంలో చివరి సినిమా రాజకీయ నేపథ్యం గల కథ అయితే బాగుటుందని సూచించడంతో వినోద్ ఇలా వస్తున్నాడు. ఇప్పటి వరకూ వినోద్ తెరకెక్కించిన చిత్రాలకు భిన్నమైన చిత్రం ఇది.