గురూజీ కోసం 3 ఏళ్లు..?
పుష్ప 2 తో నేషనల్ లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 3 కూడా చేయాల్సి ఉంది.
పుష్ప 2 తో నేషనల్ లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 3 కూడా చేయాల్సి ఉంది. ఐతే దానికి చాలా టైం ఉండేలా ఉందనిపిస్తుంది. ఐతే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరెక్షన్ లో ఫిక్స్ అయ్యింది. ఆ సినిమాపై ఇప్పటికే నిర్మాత నాగ వంశీ కామెంట్స్ అంచనాలు పెంచేస్తున్నాయి. ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని కాన్సెప్ట్ మీద ఈ సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. ఆ సినిమా విషయంలో అన్ని కూడా వేరే లెవెల్ ప్లానింగ్ ఉన్నట్టు టాక్.
ఐతే త్రివిక్రమ్ కూడా ఇప్పటివరకు తన కెరీర్ లో చేయని రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారట. నువ్వే నువ్వే సినిమా నుంచి దర్శకుడిగా మొదలు పెట్టిన త్రివిక్రమ్ అప్పటి నుంచి సింపుల్ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మన చుట్టూ జరిగే కథల్లానే అనిపించే త్రివిక్రమ్ మాటలతో అదరగొట్టేస్తాడు. ఐతే కెరీర్ లో ఫస్ట్ టైం ఒక భారీ సినిమాకు ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్ అందుకోసం అల్లు అర్జున్ బల్క్ డేట్స్ లాక్ చేస్తున్నారట.
గురూజీ అల్లు అర్జున్ ఇద్దరు ఈ సినిమాకు 3 ఏళ్లు కలిసి పనిచేసేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టబోతున్న త్రివిక్రమ్ ఈ సినిమా విషయంలో అసలు ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యేలా కనిపించట్లేదు. పురాణాలు ఇతిహాసాల మీద మంచి పట్టు ఉన్న త్రివిక్రం ఈసారి అల్లు అర్జున్ తో చేసే సినిమాను కూడా అదే కాన్సెప్ట్ తో చేస్తారని తెలుస్తుంది. ఈమధ్య తెలుగు తెర మీద అలాంటి కథలకు మంచి డిమాండ్ ఏర్పడింది. పురాణ కథలను ఇప్పటి ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా కాన్సెప్ట్ ఏంటి.. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది. బడ్జెట్ ఎంత అన్న విషయాలు సినిమా ప్రకటించిన రోజు కాస్త ఐడియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. పుష్ప 2 తో అల్లు అర్జున్ పాన్ ఇండియా హిట్ కొట్టగా త్రివిక్రమ్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 3 ఏళ్లు టైం కేటాయించే ఆలోచనలో ఉన్నాడు. ఐతే ఈ సినిమా భారీతనం చూస్తుంటే కచ్చితంగా రెండు భాగాలు చేసేలా ఉన్నారు.