టాలీవుడ్ సెలబ్రిటీలకు వర్మలక్ష్మి పెళ్లి ఆహ్వానం!
నటుడు శరత్ కుమార్ ఇంట పెళ్లి పనులు మొదలైపోయాయి. వరలక్ష్మి పెళ్లి కుమార్తెగా పీఠలెక్కడానికి రెడీ అవుతోంది
నటుడు శరత్ కుమార్ ఇంట పెళ్లి పనులు మొదలైపోయాయి. వరలక్ష్మి పెళ్లి కుమార్తెగా పీఠలెక్కడానికి రెడీ అవుతోంది. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా ఇటీవల పలువురు సినీ, రాజకీయ ప్రముఖలను కలిసి వెడ్డింగ్ కార్డ్స్ సైతం పంపిణీ చేసింది వరలక్ష్మి. రజినీకాంత్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కమల్ హాసన్ లాంటి ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందేసాయి. అలాగే నయనతార- విఘ్నేశ్ శివన్, నటుడు సిద్ధార్థ్ తో సహా పలువురు కోలీవుడ్ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానించింది.
తాజాగా టాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వాన పత్రిలకు ఇచ్చే పనిలో పడింది వరలక్ష్మి. తాజాగా ఫోటోలు బయటకు వచ్చాయి. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫ్యామిలీని కలిసి వెడ్డింగ్ కార్డ్ అందించింది. కార్డ్ తో పాటు స్పెషల్ స్వీట్ బాక్స్ కూడా అందించింది. అనంతరం ప్రశాంత్ వర్మ దంపతులతో ఓ సెల్పీ కూడా దిగింది. అలాగే మైత్రీమూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నేకి, నటుడు రాహుల్ శర్మలకు, దర్శకుడు హరీశ్ శంకర్, హీరో రవితేజకు, వంశీపైడిపల్లి దంపతులకు, నటుడు అడవి శేష్, కన్నడ నటుడు సుదీప్ కు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి, గోపీచంద్ మలిలేని కుటుంబానికి ప్రత్యేకంగా స్వయంగా ఆమె కలిసి పెళ్లికార్డుతో పాటు స్వీట్ బాక్స్ కూడా ఇచ్చింది.
ఈ సందర్బంగా వాళ్లతో కలిసి ఫోటోలు కూడా దిగింది. ఇలా తెలుగు పరిశ్రమలో తెలిసిన నటులందరికీ అమ్మడు స్వయంగా కార్డులు అందిస్తుంది. చూస్తుంటే టాలీవుడ్ సెలబ్రిటీలు అందర్నీ వరలక్ష్మి కవర్ చేసినట్లే కనిపిస్తుంది. దీనిలో భాగంగా వరలక్ష్మి సంప్రదాయ చీరకట్టులో కార్డులు పంపిణి చేసింది. ఇంకా చాలా మందిని ఆహ్వానించే అవకాశం ఉంది. పెళ్లి తేది దగ్గర పడేవరకూ ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది.
వివాహం జులై 2న థాయ్ లాండ్ లో జరుగుతుందని వార్తలొస్తున్నాయి. అనంతరం సినీ ప్రముఖుల కోసం కోసం చెన్నైలో భారీ ఎత్తున రిసెప్షన్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చిలో నికోలాయ్ సచ్దేవ్తో వరలక్ష్మి ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పెళ్లి ఎప్పుడు? అంటూ నెట్టింట ఆరాలు మొదలయ్యాయి.