దాని కోసం వరుణ్ పెళ్లినే వాయిదా వేసుకున్నాడట!
ముందుగా అనుకున్న ప్రకారం పెళ్లి అంతకు కొన్ని నెలల ముందే జరగాల్సి ఉందట. కానీ వరుణ్ తాను చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తి అయ్యేంతవరకు పెళ్లి ని వాయిదా వేసుకున్నాడట.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల వివాహం గత ఏడాది నవంబర్ 1న వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. ముందుగా అనుకున్న ప్రకారం పెళ్లి అంతకు కొన్ని నెలల ముందే జరగాల్సి ఉందట. కానీ వరుణ్ తాను చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తి అయ్యేంతవరకు పెళ్లి ని వాయిదా వేసుకున్నాడట.
తాజాగా వరుణ్ తేజ్ తన ఆపరేషన్ వాలంటైన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడాడు. ఆ సమయంలో తన పెళ్లి ని వాయిదా వేసుకుని మరీ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాను. చాలా కఠినమైన పరిస్థితుల్లో సినిమా షూటింగ్ ను పూర్తి చేశామని ప్రమోషన్ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.
ఆపరేషన్ వాలంటైన్ షూటింగ్ ను నిజమైన ఎయిర్ బేస్ లో చేశాం. అక్కడకు ఫోన్ లు అనుమతించరు. ఉదయం 8 గంటల వరకు మొత్తం టీం అక్కడ ఉండేవాళ్లం. అక్కడి అధికారులు చెప్పిన పలు ఆపరేషన్ లు ఇతర సాహసాల గురించి విని స్ఫూర్తి పొందాను.
షూటింగ్ పూర్తి అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని, తన పెళ్లి వల్ల ఈ సినిమాకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదు అనే ఉద్దేశ్యంతో ముందుగా అనుకున్న తేదీని కాదని మరో ముహూర్తం ను పెట్టించినట్లు వరుణ్ తేజ్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆపరేషన్ వాలంటైన్ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందినట్లుగా ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది. సినిమా పై యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. తప్పకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.