వెంకీపై చిరాకుతో ఛాన్సిచ్చిన రావిపూడి
సంక్రాంతి వస్తున్నాం.. అంటూ టైటిల్ తోనే పండగను టార్గెట్ చేసిన అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళుతున్నాడు.
సంక్రాంతి వస్తున్నాం.. అంటూ టైటిల్ తోనే పండగను టార్గెట్ చేసిన అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళుతున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ప్రమోషన్ విషయంలో కూడా దర్శకుడు వదులుతున్న వీడియోలు కూడా మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే గోదారి గట్టు, మీను.. అనే రెండు పాటలు కూడా మంచి హైప్ క్రియేట్ చేశాయి.
లేటెస్ట్ గా మరో సాంగ్ కు సంబంధించిన అప్డేట్ తో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశారు. ఇటీవల చిత్ర బృందం విడుదల చేసిన ఒక వీడియోలో దర్శకుడు అనిల్ రావిపూడి, వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, నిర్మాత శిరీష్, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో హైలెట్ అయ్యారు. మూడో పాటకు బాలీవుడ్, కోలీవుడ్ నుంచి స్టార్ సింగర్ ను తెప్పించాలని దర్శకుడు అనిల్ భీమ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు.
అయితే ఇంతలో వెంకటేష్ వచ్చిన నేను పాడతాను అంటూ అదే తన నిర్ణయమని తెలియజేస్తాడు. మొదట ఈ పాటకు బాలీవుడ్ ప్రముఖ గాయకుడిని తీసుకురావాలని అనిల్ రావిపూడి భావించారు. అయితే, వెంకటేశ్ స్వయంగా ఈ పాటను పాడతానని మళ్ళీ మళ్ళీ కోరడంతో అనిల్ చిరాకుతో స్పందించిన విధానం హైలెట్ అయ్యింది. అంతే కాకుండా స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ ఉద్యోగం కోసం విసిగించినప్పుడు వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వాడడం ఆకట్టుకుంది.
ఫైనల్ గా విక్టరీ వెంకటేశ్ మరోసారి తన స్వరంతో అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ‘గురు’ చిత్రంలోని ‘జింగిడీ జింగిడీ’ పాటతో తన గాత్రం ద్వారా ప్రేక్షకులను అలరించిన వెంకటేశ్ ఇప్పుడు తన కొత్త చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో ప్రత్యేక పాట పాడటానికి ముందుకొచ్చారు. సంక్రాంతి పండుగను ఉద్దేశించి తెరకెక్కుతున్న ఈ ఫెస్టివల్ సాంగ్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఈ పాటను ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ గీతం, కుటుంబ అనుబంధాలు, పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన చిత్రంలోని మొదటి రెండు పాటలు మంచి విజయాన్ని సాధించగా, ఈ ప్రత్యేక సంక్రాంతి పాట కూడా అలరిస్తుందని చిత్ర బృందం ఆశాభావంతో ఉంది. చిత్రంలో వెంకటేశ్ మాజీ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఐశ్వర్య రాజేష్ ఆయన భార్యగా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి మాజీ ప్రేయసి పాత్రలో కనిపించనున్నారు.
ఇక కథలో కుటుంబ సంబంధాల మధ్య సున్నితమైన భావోద్వేగాలు, హాస్యం, సంగీతం ప్రధానంగా ఉండనున్నాయని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనేమాటోగ్రఫీ బాధ్యతలను సమీర్ రెడ్డి అందించగా, ప్రొడక్షన్ డిజైన్‌ను ఏఎస్ ప్రకాశ్ చేశారు. వి. వేంకట్ యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేశారు. ఈ సంక్రాంతికి జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.