మెగాస్టార్ చిరంజీవి 90వ దశంలో చేసిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాను చాలాసార్లు చాలామంది ఆసక్తికరంగా కొత్తగా మళ్లీ తీయాలని ప్రయత్నించారు కాని.. ఎందుకో ఆ దశలో సఫలం కాలేదు. చూస్తుంటే ఇప్పుడు ''ఏంజెల్'' సినిమా కథ కూడా ఇదే తరహాలో ఉంది. కాకపోతే ఇక్కడ దర్శకుడికి బాహుబలి సినిమాకు పనిచేసిన అనుభవం ఉండటంతో.. గ్రాఫిక్స్ విషయంలో ఏదో కొత్తగానే చూపిస్తున్నాడు.
భువి నుండి దివికి ఒక ఏంజెల్ దిగొస్తుంది. ఆమె గరుత్మంతుని కూతురు అనుకుంట. అయితే ఆ ఏంజెల్ ను భూమ్మీద ఒక చోట నుండి మరోచోటికి విగ్రహాలు తరలించే కుర్రాడు (నాగ్ అన్వేష్) ఎక్కడికో తీసుకెళుతూ ఉంటాడు. ఆ దారిలో వారికి ఎదురయ్యే చిక్కులు.. అడ్డులు.. విలన్లు.. కామెడీలు.. చూస్తుంటే ఏంజెల్ ట్రైలర్ లో మాస్ మసాలా ఎలిమింట్స్ అన్నీ పుష్కలంగానే కనిపిస్తున్నాయిలే. హీరోగా నాగ అన్వేష్ బాగానే ఉన్నాడు. ఇకపోతే హెబ్బా పటేల్ గ్లామర్ కూడా సినిమాకు ప్లస్సయ్యేలా ఉంది. అవన్నీ ఒకెత్తయితే గ్రాఫిక్స్ చూస్తుంటే ఏదో కొత్తగానే అనిపిస్తోంది. ఫ్యాంటసీ సినిమాలకు ఈ గ్రాఫిక్సే కీలకం. మరి దర్శకుడు బాహుబలి పళని వాటిని సరిగ్గా తీశాడంటే మాత్రం సినిమా వర్కవుట్ అయిపోతుంది.
ఓ రకంగా చెప్పాలంటే ఏంజెల్ సినిమా ట్రైలర్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు కొత్త వర్షెన్ లా ఉంది. సినిమాలోని కంటెంట్ ఇంప్రెస్ చేస్తే మాత్రం ఇలాంటి ఫ్యాంటసీ కథలు ఎప్పుడూ హిట్టే. చూద్దాం ఏమవుతుందో!!
Full View