దట్ ఈజ్ 'ది దేవరకొండ'..!

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి రౌడీ బోయ్ గా ప్రేక్షకుల మెప్పు పొందిన విజయ్ దేవరకొండ తనకు తానుగా స్టార్ మెటీరియల్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు.

Update: 2024-04-02 06:24 GMT

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి రౌడీ బోయ్ గా ప్రేక్షకుల మెప్పు పొందిన విజయ్ దేవరకొండ తనకు తానుగా స్టార్ మెటీరియల్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు. పెళ్లిచూపులుతో క్లాసిక్ హిట్ అందుకున్న విజయ్ ఆ తర్వాత అర్జున్ రెడ్డితో తన నట విశ్వరూపం చూపించాడు. సందీప్ రెడ్డి రాసుకున్న పాత్రకు 100 కి 100 శాతం కాదు అంతకుమించి క్యారెక్టరైజేషన్ ని ఇంపాక్ట్ ఫుల్ గా చేశాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమాతోనే యూత్ లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసిన విజయ్ గీతా గోవిందం, టాక్సీ వాలా సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు.

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. 2018లో ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకున్న విజయ్ దేవరకొండ 2019 లో ఆ అవార్డు అమ్మేశాడు. అవార్డు అమ్మడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. తనకు వచ్చిన మొట్ట మొదటి బిగ్గెస్ట్ అవార్డు అది. అయినా సరే దాన్ని దాచిపెట్టుకోవడం కన్నా ఒక మంచి పనికి ఉపయోగించడం బెటర్ అని డిసైడ్ అయిన విజయ్ దేవరకొండ అవార్డుని ఆక్షన్ లో పెట్టాడు.

విజయ్ అంచనా ప్రకారం దానికి ఒక 5 లక్షల దాకా వస్తాయని అనుకోగా దివి ల్యాబ్స్ వారు దాన్ని పాతిక లక్షలకు కొన్నారు. దివి ల్యాబ్స్ ఫ్యామిలీ సభ్యురాలు శ్యామలా దేవి అవార్డుని దక్కించుకున్నారు. అలా వచ్చిన మొత్తాన్ని సిఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చేశాడు విజయ్ దేవరకొండ. తనకు వచ్చిన అవార్డుని సైతం విజయ్ అమ్మేసి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడంటే అతని కమిట్మెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

మళ్లీ ఫ్యూచర్ లో ఇలాంటి అవార్డులను ఎన్నో పొందొచ్చు అన్న నమ్మకం కావొచ్చు. అవార్డులు ఇంట్లో గ్లాస్ సెల్ఫ్ లో పెట్టడం కన్నా అలా ఒక మంచి పనికి ఉపయోగించడం మేలనే ఆలోచన కావొచ్చు. ఫిల్మ్ ఫేర్ అవార్డుని విజయ్ దేవరకొండ వేలం వేయడం అప్పట్లో ఒక సెన్సేషన్ గా మారింది. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో విజయ్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అమ్మడంపై ప్రశ్న ఎదురవగా విజయ్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఆక్షన్ లో అమ్మేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఈ విషయం తెలియని ఆయన ఫ్యాన్స్ హ్యాట్సాఫ్ విజయ్.. దట్ ఈజ్ ది విజయ్ దేవరకొండ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Full View
Tags:    

Similar News