వినడానికి బాగానే ఉన్నా… తేడా కొడుతోంది అక్కడే

శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ జోడీగా ఖుషి మూవీ తెరకెక్కుతోంది. ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఆవిష్కరించే పనిలో ఉన్నారు.

Update: 2023-07-30 04:27 GMT

శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ జోడీగా ఖుషి మూవీ తెరకెక్కుతోంది. ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఆవిష్కరించే పనిలో ఉన్నారు. సెప్టెంబర్ 1న ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. ఏకంగా ఐదు భాషలలో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఖుషి మూవీ నుంచి ఇప్పటి వరకు మూడు సాంగ్స్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

ఈ మూడు కూడా మంచి ఆహ్లాదకరమైన సంగీతంతో బాగా కనెక్ట్ అయ్యాయి. వాహబ్ సంగీతం రిఫ్రెష్ గా తెలుగు ఆడియన్స్ కి కొత్తగా ఉండటంతో ఈ సాంగ్స్ ని అందరూ ఆశ్వాదిస్తున్నారు. సాంగ్స్ విన్న ప్రతి ఒక్కరు బాగున్నాయని కామెంట్స్ పెడుతున్నారు. ఖుషి సినిమాకి ఈ పాటలు పాజిటివ్ వైబ్ తీసుకొచ్చాయని కూడా అర్ధమవుతోంది. ఖుషి చిత్రాన్ని శివ నిర్వాణ ఎలా మార్కెట్ లోకి వదలాలని అనుకుంటున్నారో అలాగే సాంగ్స్ ద్వారా రీచ్ అవుతోంది.

అయితే అంతా బాగున్నా పాటల విషయంలో కొన్ని విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. అవి సాహిత్యం. పాట ఎంత ముఖ్యమో అందులో సాహిత్యం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుంది. పాటలపై పట్టుకున్న వారు అద్భుతమైన సాహిత్యాన్ని జోడించి రాస్తారు. వర్ణన, పద నిర్మాణం కూడా పెర్ఫెక్ట్ గా ఉంటుంది. అయితే కథా రచయితలకి పాటల సాహిత్యం మీద అంత పట్టు ఉండదు.

ఒక్కోసారి మాత్రం తన కలానికి పనిచెప్పి పాటలు రాస్తూ ఉంటారు. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే కొన్ని సినిమాలకి పాటలు రాశారు. పూరి జగన్నాథ్ కూడా ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేశారు. అయితే వీరు పాటలు రాయడం అనేది పూర్తి బాధ్యతగా తీసుకోలేదు. ఏదో సరదా కోసం ప్రయత్నం చేసి వదిలేశారు. కానీ ఖుషి సినిమాలోని ఇప్పటి వరకు వచ్చిన మూడు సాంగ్స్ ని శివ నిర్వాణ రాశారు. పదాల అల్లికలో ప్రాసలకోసం అవసరం లేకపోయిన కొన్ని హిందీ పదాలని లిరిక్స్ లో కలిపేశారు.

మణిరత్నం సినిమా టైటిల్స్ తో నా రోజా నువ్వే అనే సాంగ్ రాశారు. అంత వరకు బాగానే ఉంది. ఖుషి టైటిల్ సాంగ్ లో కూడా ప్యార్, ఆషికి లాంటి హిందీ పదాలు వాడేశారు. అలాగే ఇంగ్లీష్ లైన్స్ కూడా చాలా చోట్ల ఉన్నాయి. ట్యూన్ కి తగ్గట్లుగా లిరిక్స్ రాసినట్లు ఉంది తప్ప అంత గొప్పగా లేవని సాహితీప్రియుల అభిప్రాయం. శివ నిర్వాణ ప్రయత్నం ఖుషి మూవీ వరకు ఉంటే ఒకే కానీ ఇలాగే సాంగ్స్ కూడా తన సినిమాలకి తానే రాసుకుంటూ వెళ్తానంటే మాత్రం తరువాత విమర్శలు వచ్చే అవకాశం ఉందనేది కొందరి మాట.

Tags:    

Similar News