ఖుషిలో కూడా అనసూయ గొడవేనా?
విజయ్ దేవర కొండ హీరోగా నటిస్తున్న చిత్రం ఖుషీ. సమంత హీరోయిన్ . ఈ మూవీ ట్రైలర్ ని తాజాగా ఈ రోజు విడుదల చేశారు.
విజయ్ దేవర కొండ హీరోగా నటిస్తున్న చిత్రం ఖుషీ. సమంత హీరోయిన్ . ఈ మూవీ ట్రైలర్ ని తాజాగా ఈ రోజు విడుదల చేశారు. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే వేలల్లో వ్యూస్ రావడం విశేషం. ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మళ్లీ గీతా గోవిందం విజయ్ ని చూసిన భావన కలుగుతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే, ఇప్పుడు ట్రైలర్ లో సమంత, విజయ్ ని పక్కన పెడితే, ఆయన ఇన్ డైరెక్ట్ గా యాంకర్ అనసూయను కెలికాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ లో ఓ మహిళతో విజయ్ మాట్లాడిన మాటలను ప్రస్తుతం హైలెట్ చేస్తున్నారు. ట్రైలర్ లో చివర్లో విజయ్ ఓ మహిళతో ‘ఎందుకు బయపడుతున్నావమ్మా నువ్వు, మార్కెట్లో నా గురించి అట్లా అనుకుంటున్నారు గానీ, నేను స్త్రీ పక్షపాతిని’ అంటూ డైలాగ్ చెప్పాడు. అయితే, అది అనసూయకు కౌంటర్ గా చెప్పాడు అని చర్చ మొదలవ్వడం విశేషం.
కొందరు మాత్రం ట్రైలర్ చూసి, అనసూయకు కౌంటర్ అని ఎలా అంటారు అని వాదిస్తున్నారు. ఇక, అనసూయ, విజయ్ ల వార్ ఇప్పటిది కాదు. అర్జున్ రెడ్డి అప్పటి నుంచి వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అర్జున్ రెడ్డిలో విజయ్ చెప్పిన ఓ డైలాగ్ కి అనసూయ అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడు ఆమెను రౌడీ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు.
తీరా, లైగర్ ప్లాప్ అవ్వడంతో, అనసూయ తన అక్కసు బయపెట్టారు. అమ్మను తిట్టిన వారు బాగుపడరు అనే ఉద్దేశం వచ్చేలా ట్వీట్ చేసింది. మళ్లీ విజయ్ ఫ్యాన్స్ కి కోపం వచ్చి, వీలు కుదరినప్పుడల్లా అనసూయను ఇబ్బంది పెట్టేలా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఈ వివాదం నుంచి ఆమె బయటపడాలి అనుకున్నా, చాలా సార్లు నాకు ఫ్యామిలీ ఉంది వదిలేయండి అని వేడుకున్నా, వారు మాత్రం వదలడం లేదు.
ఇక, ఖుషీ మూవీ విషయానికి వస్తే, కంప్లీట్ లవ్ స్టోరీ. రెండు విభిన్న మతాల వారు ప్రేమించుకొని, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వారి జీవితం ఎలా ఉంది? సంతోషంగా ఉన్నారా? లేక గొడవలతో విడిపోయారా అనేదే ఈ కథ. మూవీ సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.