VD సినిమాకు.. మంచి గిట్టుబాటు!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మళ్ళీ గీత గోవిందం సినిమా తర్వాత పరుశురామ్ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ సినిమా చేస్తున్నాడు

Update: 2023-10-18 12:49 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మళ్ళీ గీత గోవిందం సినిమా తర్వాత పరుశురామ్ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ సినిమా చేస్తున్నాడు. అది కూడా సంక్రాంతిని టార్గెట్ చేస్తూ వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే పోటీగా మరికొన్ని సినిమాలు ఉన్నప్పటికీ దిల్ రాజు ఈ సినిమాను ఫెస్టివల్ కు రిలీజ్ చేస్తూ ఉండడంతో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్థమవుతుంది.

ఎందుకంటే ఈ సినిమా గీతగోవిందం కాంబినేషన్లో వస్తూ ఉండడం మాత్రమే కాదు పూర్తిస్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కూడా దర్శకుడు తీర్చిదిద్దుతున్నాడు. కాబట్టి సంక్రాంతిలో ఎన్ని డిఫరెంట్ సినిమాలు ఉన్నా ఒక ఫ్యామిలీ సినిమా ఉంటే దానిపై కూడా ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఈ సినిమాను రాజుగారు గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఇక సినిమాకు కథకు సెట్ అయ్యేవిధంగా ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ కూడా అనుకుంటూ ఉన్నారు. సినిమాకు నిర్మాత దిల్ రాజు అప్పుడే మంచి మార్కెట్ క్రియేట్ అయ్యే విధంగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేసారు. అయితే కొన్ని ఏరియాల డీల్స్ కూడా ఇప్పటికే క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండకు మంచి డిమాండ్ అన్న విషయం తెలిసిందే.

ఇక పరశురామ్ సినిమాలు కూడా యూఎస్ లాంటి మార్కెట్లో మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు గీతగోవిందం కాంబినేషన్ డిమాండ్ కు తగ్గట్టుగా దిల్ రాజుకు ఓవర్సీస్ లో మంచి లాభాలను అందిస్తున్న సమాచారం. యూఎస్ లో మాత్రమే ఈ సినిమా హక్కులు 5.50 కోట్ల వరకు ధన పలికినట్లు సమాచారం.

ఇక ఓవర్సీస్ మొత్తంలో చూసుకుంటే దాదాపు ఎనిమిది కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అంటే మొత్తంలో కూడా ఈ సినిమా 1.8 మిలియన్ డాలర్ల టార్గెట్ ను అందుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఫ్యామిలీ స్టోరీ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ మంచి కామెడీ టైమింగ్తో మెప్పించబొతున్నట్లు తెలుస్తోంది. కుటుంబలకు సంబంధించిన ఒక ఫ్రెష్ పాయింట్, లవ్ ఎమోషన్స్ కూడా ఇందులో హైలెట్ అవుతాయట. కూతురు ఎమోషన్ కూడా ఈ సినిమాలో దర్శకుడు మిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్టు రాజు గారికి ఎంతవరకు ప్రాఫిట్స్ అందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News