ఆ స్టార్ హీరో రోల్స్ రాయ్స్ అమ్మ‌కానికి!

అయితే తాజాగా త‌ల‌ప‌తి విజ‌య్ త‌న రోల్స్ రాయ్స్ కారును అమ్మ‌కానికి పెట్టిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

Update: 2024-08-03 06:01 GMT

రోల్స్ రాయ్స్ సెల‌బ్రిటీల రేంజ్ ని హైలైట్ చేసే కారిది. కేవ‌లం అతికొద్ది మంది హీరోలు మాత్ర‌మే రోల్స్ రాయ్స్ వినియోగిస్తున్నారు. కంపెనీ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి కొంత మందికే ఇలాంటి కార్లను కంపెనీ అందుబాటులో ఉంచుతుంది. కార్ల‌లోనే ఇదో ప్ర‌త్యేక‌మైన బ్రాండ్ గా హైలైట్ అవుతుంది. అయితే తాజాగా త‌ల‌ప‌తి విజ‌య్ త‌న రోల్స్ రాయ్స్ కారును అమ్మ‌కానికి పెట్టిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

2012 లో ఈ కారును ఎంతో ఇష్ట‌ప‌డి విజ‌య్ కొనుగోలు చేసారు. ప్ర‌త్యేకంగా విదేశాల‌ను ఇండియాకి తెప్పించారు. కొనుగోలు చేసిన అనంత‌రం లోక‌ల్ ట్యాక్స్ క‌ట్ట‌లేద‌నే అరోప‌ణ‌లు విజ‌య్ ఎదుర్కున్నాడు. ఈ వ్య‌వ‌హారంలో విజ‌య్ కోర్టు మెట్టు సైతం ఎక్కారు. కానీ అక్కడా విజ‌య్ కి భంగ‌పాటు త‌ప్ప‌లేదు. చెన్నై కోర్టు ల‌క్ష రూపాయ‌లు జ‌రిమానా కూడా విధించింది. అదుకు గ‌ల అస‌లు కార‌ణాలు ఏంటి? అన్న‌ది తెలియ‌దు గానీ విజ‌య్ త‌నవైపు నుంచి చ‌ట్ట‌ప‌రంగా ఎలాంటి త‌ప్పిదం చోటుచేసుకోలేద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేసారు.

అలా తొలిసారే విజ‌య్ కి రోల్స్ రాయ్స్ నుంచి ఆటంకం ఎదురైంది. అయితే ఇప్పుడీ కారు ఎంపైర్ ఆటోస్ కార్ డీల‌ర్ షిప్ విజ‌య్ రోల్స్ రాయ్స్ అమ్మ‌కానికి వ‌చ్చిన‌ట్లు వెల్లడించింది. దీని ధ‌ర 26 కోట్ల గా చెబుతున్నారు. ఇది నిర్ణ‌యిత ధ‌ర కాదు. అయితే ఇది విజ‌య్ కారు కాద‌ని ..ఇదంతా త‌ప్పుడు ప్ర‌చారం అన్న వాదన నెట్టింట వైర‌ల్ అవుతోంది. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే విజ‌య్ లైన్ లోకి వ‌స్తే త‌ప్ప తెలియ‌దు.

ప్ర‌స్తుతం విజ‌య్ న‌టుడిగా బిజీగా ఉన్న‌సంగ‌తి తెలిసిందే. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో `గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` అనే సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే సినిమా షూటింగ్ కూడా పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. 300 కోట్ల బ‌డ్జెట్ తో ఈచిత్రాన్ని ఏజీఎస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుంది. అన్నిప‌నులు పూర్తి చేసుకుని సెప్టెంబ‌ర్ లో విడుద‌ల చేయ‌నున్నారు.

Tags:    

Similar News