ఇంటర్వ్యూల్లో ఇలాంటి చిల్లర పనులు ఏంటో..!
ప్రముఖ ఎంటర్ టైన్ ఛానల్స్ మరియు ప్రముఖ ప్రింట్ మీడియాలో మాత్రమే ఇంటర్వ్యూలు చూసే అవకాశం ఉండేది.
ఒకప్పుడు సినిమా సెలబ్రిటీల ఇంటర్వ్యూ అంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూసేవారు. ప్రముఖ ఎంటర్ టైన్ ఛానల్స్ మరియు ప్రముఖ ప్రింట్ మీడియాలో మాత్రమే ఇంటర్వ్యూలు చూసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు సెలబ్రిటీ ఇంటర్వ్యూలకు విలువ లేకుండా కొందరు చేశారు.
యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత దారుణంగా పరిస్థితి మారింది. ఇంటర్వ్యూల పేరుతో వారు చేసే చిల్లర పనులకు ప్రేక్షకులకు చిర్రెత్తుకు వస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా కొంత పాపులారిటీ వచ్చిన వారిని కూడా పట్టుకు వచ్చి ఇంటర్వ్యూ చేస్తూ వారితో ఇష్టానుసారంగా యాంకర్స్ మాట్లాడటం మనం చూస్తున్నాం.
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ వారు వాలంటైన్ డే సందర్భంగా బిగ్ బాస్ ఫేం వాసంత కృష్ణన్ ను మరియు ఆమె భర్తను తమ కార్యక్రమంకు ఆహ్వానించడం జరిగింది. ఇంటర్వ్యూ పేరుతో అక్కడ రకరకాల గేమ్స్ ఆడిపించారు. సాధారణ గేమ్స్ అయితే పర్వాలేదు కానీ దారుణంగా వారు ప్రవర్తించారు.
ఇంటర్వ్యూలో వాసంతి మరియు ఆమె భర్త తో చిన్న ద్రాక్ష పండు ఇచ్చి ఒకరి నోటితో మరొకరి నోటికి అందించడం తో పాటు ఇంకా ఏదో ఏదో యాక్ట్ లు చేయించారు. ఆ ఇంటర్వ్యూ గురించి సోషల్ మీడియాలో చాలా మంది విమర్శలు చేస్తున్నారు.
హుందాగా ఉండాల్సిన టాక్ షో లు, ఇంటర్వ్యూలు ఇలా దారి తప్పాయి ఏంట్రా బాబు అంటూ చాలా మంది తల బాదుకుంటూ ఉన్నారు. ఇప్పుడు స్టార్స్ ఇంటర్వ్యూ ఇవ్వాలి అన్నా కూడా చిరాకు పడే పరిసర్థితి ఏర్పడింది. ఇలాంటి చిల్లర పనులు ఎప్పటికి ఆపేస్తారు అంటూ నెటిజన్స్ ఇంటర్వ్యూవర్స్ ని ప్రశ్నిస్తున్నారు.