దసరా బాక్సాఫీస్.. అసలు సౌండ్ లేదే..

అసలు రజినీకాంత్ సినిమా కలెక్షన్స్ మరీ ఈ రేంజ్ లో తగ్గుతాయని ఎవరు ఊహించలేదు.

Update: 2024-10-12 22:30 GMT

దసరా సెలవుల్లో టాలీవుడ్ లో కొన్ని డిఫరెంట్ సినిమాలు విడుదల అయ్యాయి. రజనీకాంత్ హీరోగా నటించిన ‘వేట్టయన్’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ, ప్రేక్షకుల నుంచి వచ్చిన మిశ్రమ స్పందనతో పాటు పలు కొత్త చిత్రాలు విడుదల కావడంతో రెండవ రోజు వేట్టయన్ వసూళ్లు కాస్త తగ్గాయి.

అసలు రజినీకాంత్ సినిమా కలెక్షన్స్ మరీ ఈ రేంజ్ లో తగ్గుతాయని ఎవరు ఊహించలేదు. కానీ మిగతా రోజుల్లో పెరుగుతాయని డిస్ట్రిబ్యూటర్స్ నమ్ముతున్నారు. ఇక గోపీచంద్ మరియు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘విశ్వం’ శుక్రవారం విడుదలైంది. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఫైనాన్షియల్ ఇబ్బందుల కారణంగా ఉదయం షోలను రద్దు చేయాల్సి వచ్చింది. ఇది మాత్రమే కాకుండా, సినిమా రిలీజైన తర్వాత కూడా ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.

గోపీచంద్ మరియు శ్రీను వైట్ల కాంబినేషన్ సినిమాకు ఇంతటి దారుణమైన ఓపెనింగ్స్ రావడం ఆశ్చర్యపరిచింది. సక్సెస్ లేక సతమతమవుతున్న ఈ కాంబినేషన్ కు విశ్వం ఏమాత్రం బూస్ట్ ఇవ్వలేకపోతోంది. ఇక మరోవైపు సుధీర్ బాబు నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రం కూడా దసరా సందర్భంగా శుక్రవారం విడుదలైంది. భావోద్వేగ భరితమైన ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

థియేటర్లలో నలుగురు ప్రేక్షకులు కూడా కనిపించడం కష్టమయ్యేలా సినిమా పరిస్థితి ఉంది. దసరా లాంటి హాలీడే సీజన్ లో కూడా సుధీర్ బాబు సినిమాకు ఇంతటి డిజాస్టర్ ఓపెనింగ్స్ రావడం చాలా షాకింగ్ గా మారింది. ఇక దిల్ రాజు నిర్మించిన ‘జనక అయితే గనక’ శుక్రవారం సాయంత్రం ప్రీమియర్లతో కాస్త రిస్క్ చేసింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన మౌత్ టాక్ పాజిటివ్ గానే ఉన్నా, ప్రీమియర్ షోలకు వచ్చిన అటెండెన్స్ అంతంత మాత్రమే.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మాత్రం దసరా సెలవుల్లో తన జోరు కొనసాగిస్తోంది. సాయంత్రం మరియు రాత్రి షోలకు థియేటర్స్ లో జనాలు గట్టిగానే కనిపించారు. ఇప్పటికే వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా వీకెండ్ లో మంచి వసూళ్లు రాబట్టబోతుందని ట్రేడ్ అనలిస్ట్ లు అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఉన్న పాయింట్ ఏమిటంటే, మంచి అంచనాలు ఉన్నప్పటికీ 'వేట్టయన్', 'విశ్వం', 'మా నాన్న సూపర్ హీరో' లాంటి సినిమాలకు దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ దసరా హాలీడే సీజన్ ను ఏమాత్రం ఉపయోగించుకోలేదు.

Tags:    

Similar News