అంబానీ ఇంట పెళ్లికి అమ్మడు అందుకే ఢుమ్మా!
కానీ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మాత్రం ఆ వేడుకలో ఎక్కడా కనిపించలేదు.
అపరకుభేరుడు అంబానీ ఇంట పెళ్లికి ప్రపంచ దేశాల అధినేతలు..భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా అంతా హాజరై నవ వధువరూలను ఆశీర్వదించారు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే అటెండ్ కానీ సెలబ్రిటీ అంటూ ఎవరూ లేరు. ఆహ్వానం అందుకున్న వారంతా హాజరయ్యారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా అన్ని పరిశ్రమల నుంచి టాప్ క్లాస్ సెలబ్రిటీలంతా మూడు రోజుల వేడుకలో పాల్గొన్నారు.
కానీ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మాత్రం ఆ వేడుకలో ఎక్కడా కనిపించలేదు. బాలీవుడ్ దిగ్గజాలే దిగొచ్చినా కంగన జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు. మరి అమ్మడు ఎందుకు ఢుమ్మా కొట్టినట్లు? ఈ విషయాన్ని ఇప్పటివరకూ ఎవరూ హైలైట్ చేసింది కూడా లేదు. అలాగని ఆహ్వానం అందలేదని కాదు. స్వయంగా పెళ్లి కొడుకు అనంత్ అంబానీనే కంగన ఇంటికెళ్లి శుభలేక అందించాడు.
ఈ నేపథ్యంలో తాజాగా కంగన్ రాకపోవడానికి గల కారణాలు ఏంటి? అంటూ నెట్టింట వైరల్ అవుతు న్నాయి. దీంతో కంగన సన్నిహిత వర్గాలు లైన్ లోకి వచ్చినట్లు కనిపిస్తుంది. అయితే అనంత్ అంబానీ పెళ్లి రోజునే కంగన కుటుంబంలోని ఓ వివాహం కారణంగా అమ్మడు హాజరు కాలేదని అంటున్నారు. కానీ అసలు కారణం అదేనా? ఇంకేదైనా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బేసిక్ గా కంగన హై ప్రొఫైల్ ఇండస్ట్రీ వెడ్డింగ్ లకు హాజరు కానని స్వయంగా ఓ సందర్భంలో తెలిపింది.
ధనవంతుల ఇళ్లలో వేడుకలకు వెళ్లడం తనకు ఇష్టం ఉండదని..నిరాడంబరంగా ఉండటం అంటే ఇష్టమని వెల్లడించింది. ఆ నిర్ణయానికి కట్టుబడే వెళ్లలేదా? అన్నది ఒక డౌట్ అయితే....ఎంత బంధువుల ఇళ్లలో పెళ్లి అయినా మూడు రోజుల వేడుకలో ఒక గంట సమయాన్ని కేటాయించుకున్నా? వచ్చి కనబడి వెళ్లొచ్చు. కానీ ఆ ఛాన్స్ తీసుకోలేదు. అయితే సోషల్ మీడియా వేదికగా మాత్రం అమ్మడు అనంత్-రాధిక దంపతులకు విషెస్ తెలియజేసింది.