స్టార్ హీరోల కొడుకులు ఇలా అవుతార‌ని ఊహకే రాలేదు!

నాలుగైదు సినిమాలు పోయినా? ఏదో ఒక సినిమాతో హిట్ అందుకుంటే? స‌రి లెక్క మారిపోతుంది.

Update: 2024-09-19 07:09 GMT

స్టార్ హీరోల కొడుకులంటే? ఇండ‌స్ట్రీలో వారి వార‌స‌త్వం కొన‌సాగించాలి కాబ‌ట్టి క‌చ్చితంగా వాళ్లు హీరోలు గానే ఎంట్రీ ఇస్తుంటారు. పాత త‌రం నటుల నుంచి నేటిత‌రం జ‌న‌రేష‌న్ హీరోల వ‌ర‌కూ ఓ సారి చ‌రిత్ర తిర‌గేస్తే ఇదే జాబితా క‌నిపిస్తుంది. ప్రేక్ష‌కాభిమానుల్లో ఓ బ‌జ్ ఉంటుంది కాబ‌ట్టి హీరో అవ్వ‌డం అన్న‌ది వాళ్ల‌కి పెద్ద విష‌యం కాదు. నాలుగైదు సినిమాలు పోయినా? ఏదో ఒక సినిమాతో హిట్ అందుకుంటే? స‌రి లెక్క మారిపోతుంది.


తండ్రి న‌ట‌వార‌సత్వం అన్న‌ది ఇండ‌స్ట్రీలో అంత బ‌లంగా ప‌నిచేస్తుంది. కానీ అందుకు భిన్నంగా ఈ ఇద్ద‌రు వార‌సుల జ‌ర్నీ మొద‌ల‌వుతుంది. వాళ్లే బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్...త‌ల‌ప‌తి విజ‌య్ కుమారుడు జాస‌న్ సంజయ్. షారుక్ బాలీవుడ్ లో...కోలీవుడ్ లో విజ‌య్ ఎంత పెద్ద హీరోలు అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. వంద‌ల కోట్ల రూపాయ‌లు వ‌సూళ్లు తేగ‌ల న‌ట‌లు. కోట్లాది మంది అభిమానించే స్టార్లు.

అలాంటి తండ్రుల కుమారులు ఏమ‌వుతారు? అంటే క‌చ్చితంగా హీరోలవుతారే అభిమానులు భావిస్తారు. కానీ వారిద్ద‌రు అంద‌రి అంచ‌నాలు త‌ల్లకిందులు చేస్తూ డైరెక్ట‌ర్లు అవుతున్నారు. ఇప్ప‌టికే జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌కుడిగా తొలి సినిమా తెలుగు హీరో సందీప్ కిష‌న్ తో క‌న్ప‌మ్ అయిన సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌కుడిగా , రైట‌ర్ గా కొంత అనుభ‌వం సంపాదించాడు. విదేశాల్లో డైరెక్ష‌న్ కోర్స్ పూర్తి చేసాడు.

ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే ఆర్య‌న్ ఖాన్ చాలా కాలంగా రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ రైటింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. న్యూయార్క్ ఫిల్మ్ ఇనిస్ట్యూట్ లో అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ తీసుకున్నాడు. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ తో ద‌ర్శ‌కుడిగా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతు న్నాడు.

అలాగే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుమారుడు అకీరా నంద‌న్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తాడా? మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవుతాడా? అనే క‌న్ప్యూజ‌న్ ఉంది. అకీరాకి సంగీతం అంటే పిచ్చి. ఈ నేప‌థ్యంలో అత‌డు మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవుతాడ‌నే ప్ర‌చారం ఉంది. అలాగే ప‌వ‌న్ సినిమాల‌కు గుడ్ బై చెబితే గ‌నుక న‌టుడిగా అత‌డి వార‌స‌త్వాన్ని కొన‌సాగించాని అభిమానులు అంతే బ‌లంగా కోరుకుంటున్నారు. మ‌రేం జ‌రుగుతుం ద‌న్న‌ది చూడాలి.

Tags:    

Similar News