రష్మిక రాజీ పడేదేలే..!
తెలుగు లో స్టార్ డం కొనసాగిస్తూనే బాలీవుడ్ ఆఫర్లు అందుకుంది.
కన్నడ భామ రష్మిక మందన్న ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ తెచ్చుకుంది. మనలో టాలెంట్ ఉంటే అది ఎప్పటికైనా సరే తెచ్చుకోవాల్సిన గుర్తింపు తెచ్చుకునేలా చేస్తుంది అని రష్మికని చూస్తే అర్ధమవుతుంది. కన్నడలో కిరిక్ పార్టీతో పాపులర్ అయిన అమ్మడు తెలుగులో ఛలో సినిమాతో సూపర్ ఎంట్రీ ఇచ్చింది. ఇక అక్కడి నుంచి రష్మిక కెరీర్ దూసుకెళ్లింది. తెలుగు లో స్టార్ డం కొనసాగిస్తూనే బాలీవుడ్ ఆఫర్లు అందుకుంది. యానిమల్, పుష్ప 2 సినిమాల హిట్ తో పాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చాటుతుంది.
ఇక ఇప్పుడు రష్మిక ఉంటే చాలు సినిమా సూపర్ హిట్టే అనే రేంజ్ కి వెళ్లింది. ఈ క్రమంలోనే రష్మికకు వరుస అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తుంది. ఫాం లో ఉన్నప్పుడు సినిమాలు రావడం కామనే కానీ వాటిల్లో హిట్ కథలను ఒడిసి పట్టుకోవడం గొప్ప విషయం. అందులో రష్మిక చాలా క్లవర్ అనిపిస్తుంది. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాలను కవర్ చేస్తుంది.
తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తున్న రష్మిక హిందీలో సల్మాన్ ఖాన్ తో సికిందర్ చేస్తుంది. ఈ సినిమాతో పాటు ఛావా ఆల్రెడీ పూర్తి కావొచ్చింది. లేటెస్ట్ గా షాహిద్ కపూర్ తో కాక్ టెయిల్ లో కూడా రష్మిక ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. రష్మిక దూకుడు చూసి మిగతా హీరోయిన్స్ అంతా కుళ్లు కునేలా ఉన్నారు.
ఐతే ఫాం లో ఉన్నా వచ్చిన ప్రతి సినిమా చేస్తున్నాం అన్నట్టు కాకుండా కథ, హీరోతో పాటు కాంబినేషన్స్ ని చూస్తుంది అమ్మడు. అందుకే అమ్మడి కెరీర్ అంత పర్ఫెక్ట్ ఫాం లో ఉందని చెప్పొచ్చు. నేషనల్ వైడ్ గా తన ఫ్యాన్స్ అందరినీ అలరించే సినిమాలతో ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు కొత్త సినిమాలతో వస్తుంది రష్మిక. కమర్షియల్ సినిమాలే కాదు వెరైటీ సినిమాల విషయంలో కూడా రాజీపడేది లేదని అంటుంది రష్మిక. సో చూస్తుంటే నెక్స్ట్ ఇయర్ కూడా రష్మిక నామ సంవత్సరంగా మారేలా ఉందనిపిస్తుంది. నేషనల్ వైడ్ గా ప్రస్తుతం టాప్ హీరోయిన్ ఎవరు అంటే కచ్చితంగా అందరు రష్మిక పేరు చెప్పేస్తారు. ఇక వరుస ఛాన్సులు, హిట్లతో డిమాండ్ పెరగడంతో రెమ్యునరేషన్ కూడా పెంచే ఆలోచనలో ఉందట క్రష్మిక. అమ్మడి హిట్ ఫాం చూసిన ఎవరైనా సరే ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడంలో అసలు వెనక్కి తగ్గరని చెప్పొచ్చు.