ఐఫోన్ ఓనర్స్ కి యాపిల్ నుంచి పేమెంట్స్!

ఈ సెటిల్మెంట్ ప్రకారం.. ప్రతి ప్రభావిత ఐఫోన్ వినియోగదారు రూ.5,400 (దాదాపు 65 డాలర్లు) కంటే ఎక్కువ డబ్బులు అందుకుంటారు.

Update: 2023-08-17 15:30 GMT

టెక్ దిగ్గజం యాపిల్.. ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే $ 65 (దాదాపు రూ.5,400) ఎలక్ట్రానిక్ గిఫ్ట్ లను కార్డ్స్ రూపంలో పంపించనుందని సమాచారం! బ్యాటరీ గేట్ సమస్యను ఫేస్ చేసిన ప్రతి ఒక్క యూజర్‌ కు ఈ డబ్బులు అందనున్నాయి. అయితే ఇది పాత ఐ ఫోన్ వాడేవారికి మాత్రమే వర్తిస్తుంది!

అవును... ఓల్డ్ ఐఫోన్ యూజర్లకు యాపిల్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు 2023, ఆగస్టు 12న యూఎస్ కోర్టు జడ్జి యాపిల్ కంపెనీ చేస్తానన్న సెటిల్మెంట్‌ కు తుది ఆమోదం తెలిపారు. పేమెంట్స్ ప్రారంభించడానికి మార్గం క్లియర్ చేశారు.

ఈ సెటిల్మెంట్ ప్రకారం.. ప్రతి ప్రభావిత ఐఫోన్ వినియోగదారు రూ.5,400 (దాదాపు 65 డాలర్లు) కంటే ఎక్కువ డబ్బులు అందుకుంటారు. ఈ మేరకు త్వరలో యాపిల్ సంస్థ ఈ పేమెంట్స్ చేయనుంది!

ఏమీటీ బ్యాటరీ గేట్ సమస్య?

2018లో యాపిల్ బ్యాటరీ లైఫ్ పొడిగించేందుకు సాఫ్ట్‌ వేర్ అప్‌ డేట్స్‌ తో ఓల్డ్ ఐఫోన్ మోడల్స్‌ ను ఉద్దేశపూర్వకంగా స్లో చేసిదనేది అభియోగం! ఈ సమస్యను చాలామంది యూజర్లు రిపోర్ట్ చేశారు. దీంతో యాపిల్ కస్టమర్లకు ప్రాతినిధ్యం వహించే న్యాయ సంస్థ కోట్చెట్, పిట్రే & మెక్‌ కార్తీ... యాపిల్‌ పై క్లాస్ యాక్షన్ దావా వేసింది.

ఈ సందర్భంగా... "బ్యాటరీ గేట్" అని పిలిచే ఈ స్కాం వల్ల కొందరి ఐఫోన్లు బ్యాటరీ పర్సంటేజ్ 30% కంటే ఎక్కువ ఛార్జ్ చూపినప్పటికీ షట్‌ డౌన్‌ అయ్యాయని తెలిపారు. బ్యాటరీ లైఫ్ తగ్గిపోతే యూజర్లు కొత్త బ్యాటరీ రీప్లేస్ చేయించుకోగలరు కానీ ఫోన్ పర్ఫామెన్స్ తగ్గడం వల్ల వారు టోటల్‌ గా ఫోన్‌ నే డ్యామేజ్ అయిపోయిందేమోనని ఆందోళన చెందారు.

వాస్తవానికి యాపిల్ సంస్థ ఐఫోన్ డివైజ్‌ లను స్లో చేస్తున్నట్లు ఎవరికీ చెప్పలేదు. దీనివల్ల ఫోన్లకు ఏమైందోనని యూజర్లు ఫ్రస్టేషన్‌ కు గురయ్యారు. ఈ సమయంలో ప్రభావిత ఐఫోన్ యూజర్లందరికీ యాపిల్ 500 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.4169 కోట్లు) చెల్లించడానికి అంగీకరించింది.

ఆ సెటిల్మెంట్‌ కు తాజాగా తుది ఆమోదం కూడా లభించింది. దీంతో వచ్చే ఏడాది నుంచి పేమెంట్స్‌ చేయడానికి కంపెనీ సిద్ధమైందని తెలుస్తోంది. ఈ పేమెంట్స్.. ఎలక్ట్రానిక్ గిఫ్ట్ కార్డ్‌ ల రూపంలో జరుగుతాయి. వీటిని యాపిల్ లేదా ఇతర రిటైలర్‌ ల నుంచి ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు.

ఈ సెటిల్మెంట్ వల్ల 2017 డిసెంబర్ 21కి ముందు ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ ఎసీ (ఫస్ట్ జనరేషన్), ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ కొనుగోలు చేసిన వినియోగదారులకు మాత్రమే ఈ మనీ అందుతుంది. దీనివల్ల సుమారు 10 కోట్ల ఐఫోన్ వినియోగదారులకు బెనిఫిట్ అందనుందని తెలుస్తోంది.

Tags:    

Similar News