గ్లో టైమ్ ప్రోగ్రాంలో.. యాపిల్ లాంఛ్ చేసేవి ఇవేనట

ఈ రోజు గ్లో టైమ్ పేరుతో యాపిల్ అతి పెద్ద ఈవెంట్ ను నిర్వహించనుంది.

Update: 2024-09-09 14:34 GMT

మిగిలిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు భిన్నంగా యాపిల్ సంస్థ ఉత్పత్తులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ నుంచి ఒక ఉత్పత్తి వస్తుందంటే.. టెక్ ప్రపంచం మాత్రమే కాదు.. యావత్ టెక్ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. టెక్నాలజీతో సంబంధం లేకున్నా.. వాటిని కొనుగోలు చేసే ఫ్యాన్స్ పిచ్చి పిచ్చిగా ఎదురుచూస్తారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు గ్లో టైమ్ పేరుతో యాపిల్ అతి పెద్ద ఈవెంట్ ను నిర్వహించనుంది.

ఈ కార్యక్రమంలోనే యాపిల్ కు చెందిన ఐఫోన్ 16సిరీస్ ఫోన్లతో పాటు మరికొన్ని ఉత్పత్తుల్ని లాంఛ్ చేయనున్నారు. ప్రపంచానికి తమ తాజా ఉత్పత్తులకు సంబంధించిన వివరాల్ని వెల్లడించనున్నారు. ఐఫోన్ 16 కాకుండా ఇంకేం ఉత్పత్తుల్ని యాపిల్ విడుదల చేయనుంది? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. టెక్ మార్కెట్ అంచనాల ప్రకారం దీనిపై ఇప్పటికే బోలెడన్ని వార్తలు వచ్చాయి.

భారత కాలమానం ప్రకారం.. ఈ రోజు రాత్రి ఈ ప్రోగ్రాం జరగనుంది. యాపిల్ పార్క్ లోని స్టీవ్ జాబ్స్ థియేటర్ లో నిర్వహించే ఈ కార్యక్రమం మన టైం ప్రకారం సోమవారం రాత్రి 10.30 గంటల నుంచి లైవ్ స్ట్రీమ్ ఉంటుందని చెబుతున్నారు.యాపిల్ వెబ్ సైట్ ద్వారా లేదంటే.. యూట్యూబ్ ద్వారా కూడా ఈ లైవ్ ను చూసే వీలుంది. ఈ ప్రోగ్రాంలో లాంచ్ చేసే ఉత్పత్తులకు సంబంధించిన అంచనాల్ని చూస్తే..

- ఐఫోన్ 16 సిరీస్ లో భాగంగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్.. ఐఫోన్ 16 ప్రో.. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లను విడుదల చేస్తారు.

- బేస్ మోడళ్లు 6.1.. 6.7అంగుళాల స్క్రీన్ తో వస్తాయని.. ప్రో మోడళ్లు 6.3, 6.9 అంగుళాల బిగ్ స్క్రీన్ లో వచ్చే వీలుంది.

- ఐఫోన్ తో పాటు వాచ్ సిరీస్ 10లో బిగ్ స్క్రీన్ ఆప్షన్ ను తీసుకు వస్తారు.

- అప్డేట్ హార్ట్ రేట్ సెన్సర్ తో లాంఛింగ్ ఉంటుంది.

- యాపిల్ వాచ్ అల్ట్రా 3, యాపిల్ వాచ్ ఎస్ఈనీపై ప్రకటన

- కొత్తగా రెండు రకాల ఐపాడ్స్

- ఐవోఎస్ 18, ఐప్యాడ్ ఓఎస్18, వాచ్ ఓఎస్ 11లకు సంబంధించిన డేట్స్ ను కూడా వెల్లడించే వీలు.

Tags:    

Similar News