ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు
మినిమం శాలరీ పీపుల్స్‌కు అది సాధ్యపడదనే చెప్పాలి. అయితే.. అలాంటి వారికోసం యాపిల్ సంస్థ ఓ గుడ్‌న్యూస్ చెప్పింది.
ఐఫోన్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. కొందరు సెక్యూరిటీ పర్పస్‌లో దానిని వాడితే.. మరికొందరేమో తమ పలుకుబడిని చాటేందుకు వినిగిస్తుంటారు. ఐఫోన్ కొనుగోలు చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. మినిమం శాలరీ పీపుల్స్‌కు అది సాధ్యపడదనే చెప్పాలి. అయితే.. అలాంటి వారికోసం యాపిల్ సంస్థ ఓ గుడ్‌న్యూస్ చెప్పింది.
ఒకవిధంగా చెప్పాలంటే ఐఫోన్ లవర్స్‌కి ఇది కిక్ ఇచ్చే న్యూస్ అనే చెప్పాలి. ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే అసలైన సమయం కూడా. ఇటీవల మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఐఫోన్ ధరలు దిగివస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఒకప్పుడు ఫారిన్ దేశాలకే పరిమితం అయిన ఐఫోన్ల క్రేజీ ఇప్పుడు ఇండియాలోనూ పెరిగిపోయింది. రోజురోజుకూ భారతదేశంలోనూ ఐఫోన్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. చాలా మంది వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అయితే.. ఇప్పుడు యాపిల్ సంస్థ ఐఫోన్ లవర్స్‌కి అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏటా ఒక కొత్త సిరీస్‌తో మార్కెట్లోకి విడుదల చేసే యాపిల్ సంస్థ.. ఇప్పుడు ఒక్కసారిగా ధరలు తగ్గించింది. ఈ నెల 9న ఐఫోన్ 16 సిరీస్ ఇండియాలో లాంచ్ కానుంది. దీంతో 15 సిరీస్ ఫోన్ల ధరలు తగ్గాయి. గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 15 ప్రో మాక్స్ ధర ఆ సమయంలో 1,59,00 ఉండేది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో దాని ధర రూ.1,32,990కు పడిపోయింది. ఇక క్రెడిట్ కార్డు, బ్యాంకులు అదనపు డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఇక ఈనెలలోనే విడుదలవుతున్న ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధర రూ.1.50 లక్షల నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.