24 కోట్ల కంప్యూటర్లు పని చేయవా? ఇప్పుడేం చేయాలి?

కంప్యూటర్ ఏదైనా అందులో వాడే ఆపరేటింగ్ సిస్టం అదేనండి ఓఎస్ మాత్రం దాదాపుగా విండోస్ ఉంటుంది.

Update: 2023-12-23 05:20 GMT

కంప్యూటర్ ఏదైనా అందులో వాడే ఆపరేటింగ్ సిస్టం అదేనండి ఓఎస్ మాత్రం దాదాపుగా విండోస్ ఉంటుంది. యాపిల్ కంప్యూటర్లలో మాత్రం దాని సొంత ఓఎస్ ను వాడేస్తుంటారు. ప్రపంచంలోని వ్యక్తిగత కంప్యూటర్లలో అత్యధికులు వాడేది మాత్రం విండోస్. తాజాగా సదరు మైక్రోసాఫ్ట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 24 కోట్ల వ్యక్తిగత కంప్యూటర్లు పని చేసే దానిపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

విండోప్ 10 ఓఎస్ ప్రభావవంతంగా పని చేసేందుకు మైక్రోసాఫ్ట్ అందించాల్సిన సాంకేతికతను ఉపసంహరించటమే తాజా సమస్యగా చెప్పాలి. అయితే.. మైక్రోసాఫ్ట్ విండోస్ అప్డేట్స్ ఉపసంహరించినా.. పని చేస్తుందని కాకుంటే సెక్యూరిటీ సమస్యలతో లోపాలు తలెత్తే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అప్డేట్స్ ఉండకపోవటంతో సెక్యూరిటీ సమస్యలు ఎదురు కానున్నాయి.

2025 అక్టోబరు తర్వాత విండోస్ ఓఎస్ ఉన్న 24 కోట్ల పీసీలకు మైక్రోసాఫ్ట్ మద్దతును ఉపసంహరించనున్నారు. విండోస్ 11కు మారితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా విండోస్ 10లోనే ఉండిపోతానని చెప్పే వారితోనే ఇబ్బంది. అయితే.. విండోస్ 10 నుంచి మారకూడదని అనుకున్న వారికి కూడా.. కొంతమేర డబ్బులు తీసుకోవటం ద్వారా 2028 అక్టోబరు వరకు సెక్యూరిటీ ఆప్డేట్ లను ఇస్తారని చెబుతున్నారు. అయితే.. ఇందుకు ఎంత ఛార్జ్ చేస్తారన్న దానిపైన మాత్రం క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే.. సెక్యూరిటీ అప్డేట్స్ కోసం మూడేళ్లు డబ్బులు కడుతూ ఉండే కన్నా.. పాతవి మార్చుకొని కొత్త కంప్యూర్లకు అప్ గ్రేడ్ కావటమే మంచి పనిగా చెబుతున్నారు.

Tags:    

Similar News