BRO ప్రాజెక్ట్.. త్రివిక్రమ్ పట్టించుకోలేదట
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా బ్రో.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా బ్రో. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే మూవీ బిజినెస్ డీల్స్ క్లోజ్ అయిపోయాయి. సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న నేపథ్యంలో మూవీ ఎలా ఉండబోతోందనే డౌట్ అందరిలో ఉంది.
ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసారు. కథ మాత్రం సముద్రఖని రాసుకున్నది అనే సంగతి తెలిసిందే. తమిళంలో సముద్రఖని స్వీయ దర్శకత్వంలో నటించిన వినోదాయ సీతమ్ రీమేక్ గానే ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే తెలుగు నేటివిటీకి వచ్చేసరికి కథనం పూర్తిగా మారిపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ప్రస్తుతం జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా బ్రో సినిమాకి కథనం, డైలాగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సమకూర్చిన నేపథ్యంలో డైరెక్షన్ పరంగా అతని ఇన్వాల్వ్ మెంట్ ఏమైనా ఉందా అనే ప్రశ్న జర్నలిస్టు నుంచి తేజ్ కి వచ్చింది. అయితే త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఇచ్చిన తర్వాత మూవీ షూటింగ్ విషయంలో అస్సలు జోక్యం చేసుకోలేదని సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. అతను అలా చేసే టైపు కాదని కూడా తేల్చేశారు.
అలాగే పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రమేయం ఉన్నా కూడా మేకింగ్ పరంగా మాత్రం అతను అస్సలు ఇన్వాల్వ్ అవ్వరని తేజ్ చెప్పుకొచ్చారు. అభిమానులు తన నుంచి ఎలాంటి అంశాలు ఎక్స్ పెక్ట్ చేస్తారనేది పవన్ కళ్యాణ్ కి తెలుసని, దానికి తగ్గట్లుగానే అతని స్టొరీల ఎంపిక ఉంటుందని తేజ్ క్లారిటీ ఇవ్వడం విశేషం.
మొత్తానికి త్రివిక్రమ్ ప్రభాస్ అయితే పవన్ కళ్యాణ్ మీద గాని, బ్రో మూవీ మేకింగ్ మీద గాని లేదని తేజ్ ఇంటర్వ్యూతో అందరికి స్పష్టం అయ్యిందని చెప్పొచ్చు. ఇన్ని రోజులు ఉన్న రూమర్స్ కి కూడా తేజ్ ఫుల్ స్టాప్ పెట్టారు.