ఎల్ఐసీ అదిరే పాలసీ... రోజుకు రూ.50 కడితే రూ.6 లక్షలు!
అవును... ఎల్ఐసీ ఆధార్ శిలా స్కీమ్ నాన్ లింక్డ్ ఇండివీజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకొచ్చింది.
దేశంలోనే అతి పెద్ద బీమా రంగ కంపెనీగా కొనసాగుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కస్టమర్లకు ఎన్నో రకాల పాలసీలు అందిస్తోంది. ఇందులో భాగంగా.. తాజాగా ఆసక్తికరమైన ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. దీని ద్వారా ఒకే సారి భారీ మొత్తం పొందొచ్చు.
అవును... ఎల్ఐసీ ఆధార్ శిలా స్కీమ్ నాన్ లింక్డ్ ఇండివీజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కేవలం మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పాలసీ దారుడు మరణిస్తే.. నామినీకి బీమా మొత్తం లభిస్తుంది. ఒకవేళ పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ సమయంలో ఒకేసరి డబ్బులు పొందొచ్చు.
ఈ ప్లాన్ తీసుకోవాలని భావిస్తే.. 8 నుంచి 55 ఏళ్ల వరకు వయసు కలిగి ఉండాలి. 10 నుంచి 20 ఏళ్ల వరకు టెన్యూర్ ఉంటుంది. మీకు నచ్చిన టెన్యూర్ తో పాలసీ తీసుకోవచ్చు. ఇందులో మినిమం రూ. 75 వేల బీమా మొత్తానికి ఈ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే గరిష్టంగా రూ. 3 లక్షల వరకు మొత్తానికి ఈ పాలసీ తీసుకోవచ్చు.
ఉదాహరణకు రూ. 3లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలని భావిస్తే.. ఎంత ప్రీమియం పడుతుందనేది ఇప్పుడు చూద్దాం. రూ. 3లక్షల బీమా తీసుకోదలిస్తే... 30ఏళ్ల వయసున్న నెలకు దాదాపు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ. 900తో రూ. 3 లక్షలు పొందొచ్చు. నెలకు 900 రూపాయలు అంటే.. రోజుకి రూ.30 అన్నమాట!
ఇదే సమయంలో ఇంట్లో కూతురి పేరుపై కూడా బీమా పాలసీ తీసుకోవాలని భావిస్తే.. అప్పుడు అదనపు ప్రీమియం కట్టాల్సి వస్తుంది. కూతురి వయసు సుమారు 15 ఏళ్లు అని అనుకుంటే.. అప్పుడు నెలవారీ ప్రీమియం రూ. 870 వరకు పడుతుంది. 20 ఏళ్ల టెన్యూర్ అయితే అప్పుడు మెచ్యూరిటీలో రూ. 3 లక్షలకు పైగా వస్తాయి. ఇలా నెలకు రూ.1570 ప్రీమియంతో ఏకంగా రూ. 6 లక్షలు లభిస్తాయన్నమాట.