మీరు లక్షాధికారి కావాలనుకుంటున్నారా?... ఇదొక్కసారి చదవండి!

ఇందులో రూ.1 లక్ష నుంచి తదుపరి లక్షకు హెచ్చింపుల్లో చేసే ప్రీకాలిక్యులేటెడ్ ఆర్డీ ఇది. అంటే... మీకు ఎంత సొమ్ము అవసరం అనే దాన్ని బట్టి నెలనెలా చెల్లింపులు చేయాల్సి ఉంటుందన్న మాట.

Update: 2025-01-08 00:30 GMT

ఉన్న సంపాదనలోనే పెట్టుబడులు పెట్టి లక్షాధికారులు కావాలని చాలామంది కలలు కంటారు. అయితే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టలేని వారు చాలా మంది నిరాశతో ఉండిపోతారు. ఈ సమయంలో.. చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టి లక్షాధికారులు కావాలనుకునేవారికోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సరికొత్త స్కీమ్ ను తీసుకొచ్చింది.

అవును... హర్ ఘర్ లఖ్ పతి రికరింగ్ డిపాజిట్ పేరుతో ఓ సరికొత్త స్కీమ్ ను తీసుకొచ్చింది ఎస్బీఐ. భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టలేనివారు లేదా చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. దీనిపై ఆకర్షణీయమైన వడ్డీని ఎస్బీఐ అందిస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దామ్!

దీని కోసం మీరు ఎంచుకున్న కాలవ్యవధికి ప్రతినెలా నిర్ణీత మొత్తం డిపాజిట్ చేసుకుంటూ వెళ్లాలి. అయితే సాధారణంగా రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) అనేది మనం కోరుకున్న మొత్తం రూ.500 నుంచి రూ.1000 లెక్కన డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ తాజాగా ఎస్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త ఆర్డీ అందుకు భిన్నంగా ఉంటుంది.

ఇందులో రూ.1 లక్ష నుంచి తదుపరి లక్షకు హెచ్చింపుల్లో చేసే ప్రీకాలిక్యులేటెడ్ ఆర్డీ ఇది. అంటే... మీకు ఎంత సొమ్ము అవసరం అనే దాన్ని బట్టి నెలనెలా చెల్లింపులు చేయాల్సి ఉంటుందన్న మాట.

ఉదాహరణకు... మీరు రూ. లక్ష పొందాలంటే మూడేళ్ల కాలవ్యవధికి నెల నెలా రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూడేళ్లకు సాధారణ పౌరుడికి 6.75 శాతం.. సీనియర్ సిటిజన్స్ కు 7.25 శాతం.. ఎస్బీఐ స్టాఫ్ కు 7.75 శాతం.. ఎస్బీఐ సీనియర్ సిటిజన్ స్టాఫ్ కు 8.25 శాతం వడ్డీ చొప్పున చెల్లిస్తారు. ఇక నాలుగెళ్లలో లక్ష పొందాలనుకుంటే.. నెలకు రూ.1,810 చెల్లించాల్సి ఉంటుంది.

అకౌంట్ ఓపెన్ చేయడానికి అర్హతలు, షరతులు ఇవే!:

భారతీయులైన నివాసితులు పర్సనల్ గా కానీ, జాయింట్ గా కానీ ఈ లఖ్ పతి ఆర్జీ పథకాన్ని ఓపెన్ చేయవచ్చు. 10 ఏళ్లు పైబడిన మైనర్లు కూడా ఈ ఆర్డీని తెరవచ్చు. లేదా.. వారి పేరు మీద తల్లితండ్రులు ఓపెన్ చేయవచ్చు. ఈ పథకానికి మూడేళ్ల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధి ఉంటుంది.

ఇక ఆర్డీలో డిపాజిట్ చేసిన మొత్తం నిర్ణీతం కాలానికంటే ముందుగానే కావాలంటే.. అది రూ.5 లక్షల లోపు విత్ డ్రా అయితే ప్రిన్సిపల్ అమౌంట్ పై 0.50 శాతం.. రూ.5 లక్షలకు పైబడిన అమౌంట్ పై అయితే 1 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా వరుసగా ఆరు నెలలు ఇన్ స్టాల్ మెంట్ చెల్లించకపోతే ఆ ఖాతాను మూసేస్తారు.

అనంతరం ఆ మొత్తాన్ని డిపాజిట్ దారుడి బ్యాంక్ అకౌంట్ కు బదిలీ చేస్తారు. ఇదే సమయంలో ఇన్ స్టాల్ మెంట్స్ ఆలస్యమైతే రూ.100 కు రూ.1.50 నుంచి రూ.2 వరకూ జరిమానా పడుతుంది.

Tags:    

Similar News