బాబు పక్కన పవన్ మిస్ !
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరసగా మూడోసారి కలెక్టర్ల సదస్సుని ఏపీ సచివాలయంలో నిర్వహిస్తున్నారు.;
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరసగా మూడోసారి కలెక్టర్ల సదస్సుని ఏపీ సచివాలయంలో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు అన్ని జిల్లాల కలెక్టర్లు కీలక శాఖల ఉన్నతాధికారులు మొత్తం మంత్రిమండలితో పాటు వివిధ రంగాల నిపుణులు హాజరవుతారు.
ఈ మీటింగ్ ద్వారా పాలన మరింతగా ప్రజలకు చేరువ చేయడమే కాకుండా కలెక్టర్లకు ప్రభుత్వ యంత్రాంగానికి కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలు గురించి వివరించడం వాటిని పరుగులు పెట్టించేలా లక్ష్యాలను నిర్దేశించడం వంటివి చేస్తారు.
ఇప్పటికి జరిగిన రెండు కలెక్టర్ల సదస్సులు విజయవంతం అయ్యాయి. ఇపుడు మూడవది నిర్వహిస్తున్నారు. మంత్రులు అంతా హాజరైన ఈ కీలక మీటింగులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించలేదు. అది మళ్ళీ ఒక చర్చగా సాగుతూ వచ్చింది.
కీలకమైన సమావేశాలు జరిగినపుడు పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదు ఎందుకు అన్న చర్చ సాగుతోంది. అయితే ఈసారి మీటింగుకు పవన్ రాకపోవడానికి రీజన్స్ ఉన్నాయని అంటున్నారు. ఆయన ఆరోగ్య కారణాల వల్లనే హాజరు కాలేదని అంటున్నారు. ఈ విషయం సీఎం కి ముందే చెప్పారని అంటున్నారు.
అందువల్లనే చంద్రబాబు కూడా పవన్ ఈ సమావేశానికి వ్యక్తిగత కారణాల వల్లనే హాజరు కాలేదని చెప్పారు. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, అలాగే డీజీపీ హరీష్ గుప్తాతో పాటు ఉన్నతాధికారులు అంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఒక్కో శాఖ మీద సమగ్రమైన లోతైన చర్చ సాగుతోంది. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను గ్రౌండ్ లెవెల్ లో తీసుకెళ్ళాల్సిన బాధ్యత కలెక్టర్లదే కాబట్టి ప్రభుత్వం వారితో తరచూ భేటీ అవుతూ మార్గనిర్దేశకత్వం చేస్తోంది.
ఇక ఈ సమావేశానికి పవన్ హాజరు కాకపోవడం మీద చర్చ జరుగుతున్నప్పటికీ ఆయన ఆరోగ్యం బాగా లేనందులే రాలేదని చెబుతున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి వంటి కీలక స్థానంలో ఉన్న పవన్ వచ్చే సారికైనా ఇలాంటి సమావేశాలలో పాల్గొంటే బాగుంటుంది అన్నది పలువురి సూచన.
ఈ సమావేశాల ద్వారా ప్రతీ జిల్లాలో ఏమి జరుగుతుంది అన్నది నేరుగా తెలుసుకునే వీలు కలుగుతుంది. దానిని బట్టి ప్రభుత్వ పెద్దలు కూడా తన కార్యాచరణను మరింత మార్పు చేసుకోవడానికి వీలు కలుగుతుంది అని అంటున్నారు. కలెక్టర్ల సదస్సులో పవన్ ఉంటే ఆ గ్లామరే వేరు అన్న మాట ఉంది. సో వచ్చేసారికైనా ఆయన హాజరు కావాలని అంతా కోరుకుంటున్నారు.