గుర్తుపట్టలేని స్థితిలో వల్లభనేని వంశీ..షాకింగ్ వీడియో

వంశీ లేటెస్ట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.;

Update: 2025-03-25 15:27 GMT

వల్లభనేని వంశీ.. ఆ పేరులోనే ఒక వైబ్ ఉంది. ఆయన రాజకీయంలోనూ అంతే ఉండేది. టీడీపీలో ఉన్నప్పుడు.. తర్వాత జగన్ కు మద్దతుగా వైసీపీలో చేరినప్పుడు కూడా ఆయనలో ఆ పౌరుషం.. మాటకారితనం అంతే ఉవ్వెత్తున లేచేది. కానీ ఇప్పుడు కేసులతో ఆయన తనవన్నీ కోల్పోయారు. నెరిసిన జట్టు.. నిస్తేజమైన చూపులు.. అసలు ఓపిక లేని శరీర కవలికలతో కోర్టుకు హాజరైన వంశీని చూసి ఆయన అభిమానులు కలతచెందారు. అసలు ఈయన వంశీయేనా? అన్న రీతిలో గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. వంశీ లేటెస్ట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు - లోకేష్‌లను తీవ్రంగా విమర్శించిన వారిలో వల్లభనేని వంశీ ఒకరు. టీడీపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన, బాబు - లోకేష్ లకు వ్యతిరేకంగా గతంలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు. అవి తీవ్ర దుమారం రేపాయి. అధికారం మారడంతో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆయనపైనున్న కేసుల విషయంలో ముందుకెళ్లింది. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి వంశీ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

ఈ కేసులో బెయిల్ పొందాలని వంశీ ఆశించారు, కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టు ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈరోజు ఏప్రిల్ 8 వరకు పొడిగించింది. అంటే, ఆయన మరికొన్ని రోజులు కస్టడీలోనే ఉండాల్సి ఉంటుంది.

ఇక వల్లభనేని వంశీని ఈరోజు కోర్టుకు తీసుకువచ్చినప్పుడు ఆయన దాదాపు గుర్తుపట్టలేని స్థితిలో కనిపించారు. నెరిసిన జుట్టు , నిస్తేజమైన చూపుతో ఆయన పూర్తిగా మారిపోయారు. వంశీని అరెస్టు చేసిన రోజున ఆయన ప్రదర్శించిన విశ్వాసం ఇప్పుడు ఆయన ముఖం నుండి పూర్తిగా మాయమైపోయాయని సోషల్ మీడియా ఆ వీడియోను షేర్ చేస్తూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News