హీటెక్కించే న్యూస్ : నాగబాబు మంత్రిగా...తీసివేతలు కూడా ?

తెలంగాణలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ఖాళీలలో కొత్త వారిని తీసుకోవడమే కాకుండా ప్రస్తుతం ఉన్న వారిలో కొందరికి ఉద్వాసన ఉంటుందని ప్రచారం ఒక రేంజిలో సాగుతోంది.;

Update: 2025-03-25 10:30 GMT

తెలంగాణలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ఖాళీలలో కొత్త వారిని తీసుకోవడమే కాకుండా ప్రస్తుతం ఉన్న వారిలో కొందరికి ఉద్వాసన ఉంటుందని ప్రచారం ఒక రేంజిలో సాగుతోంది. దానికి సంబంధించిన పరిణామాలు కూడా చకచకా కాంగ్రెస్ లో సాగుతున్నాయి.

కానీ ఉరమని పిడుగులా ఏపీలో ఇపుడు ఒక్కసారిగా హీటెక్కించే న్యూస్ షికారు చేస్తోంది. అదేంటి అంటే మరో నాలుగు రోజుల్లో ఏపీ మంత్రివర్గ విస్తరణ అని. నిజంగా ఇది నిజమా అని కూటమి ఎమ్మెల్యేలే అనుకునే పరిస్థితి. నిజానికి చూస్తే ఏపీ మంత్రివర్గం ఏర్పాటు అయి తొమ్మిది నెలలు మాత్రమే అయింది.

నిండా ఏడాది పూర్తి కాలేదు. అదే తెలంగాణలో పదిహేను నెలలుగా మంత్రివర్గం కొనసాగుతోంది. పైగా ఖాళీలు ఉన్నాయి దాంతో వాటిని భర్తీ చేసే క్రమంలో ఒకరిద్దరికి చెక్ పెడతారు అన్నది అక్కడ సాగుతున్న ప్రచారం. కానీ ఏపీకి ఆ అవసరం ఏమీ లేదు కదా అన్నదే చర్చ.

అయితే జనసేన కోటాలో ఎమ్మెల్సీగా నెగ్గిన మెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటారు అని అంటున్నారు. ఆయనకు ఈ మేరకు ఒక బలమైన హామీ ఉందని అంటున్నారు. ఆయన ఎమ్మెల్సీ అయిందే జస్ట్ పెద్దల సభలో సభ్యుడిగా కోసం కాదని. మంత్రి కావడం కోసమే అని అంటున్నారు.

ఇక కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసిన సంగతిని కూడా గుర్తు చేస్తున్నారు. దాంతో నాగబాబుకు మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. అది కూడా తెలుగు వారి కొత్త ఏడాది అయిన ఉగాది వేళ అని అంటున్నారు. ఆ మంచి ముహూర్తంలోనే నాగబాబు మంత్రి అవుతారు అని అంటున్నారు.

అయితే ప్రస్తుతం సాగుతున్న ప్రచారం బట్టి చూస్తే కనుక మంత్రివర్గం విస్తరణ అని అంటున్నారు. అంటే కేవలం నాగబాబుతోనే అది ఆగదని కొంత మందిని పక్కన పెట్టి ఆ ప్లేస్ లో కొత్త వారికి చాన్స్ ఇస్తారని అంటున్నారు. అంటే ఒక విధంగా చూస్తే ఇది ఒక బిగ్ ఎక్సర్ సైజ్ గానే ఉండబోతోంది అని అంటున్నారు.

పనితీరు ఆధారం చేసుకుని కొంతమందిని తప్పించవచ్చు అని అదే సమయంలో మరి కొందరికి చాన్స్ దక్కవచ్చు అని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కాకుండా మొత్తం 22 మంది మంత్రులు ఉన్నారు. నాగబాబుని కచ్చితంగా తీసుకుంటారు అంటే వీరందరికీ ఒక కఠిన పరీక్ష అనే అంటున్నారు.

ఎందుకంటే మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణ అని కూడికలు తీసివేతలు ఆ లెక్కలు రాజకీయ సామాజిక సమీకరణలు అన్నీ చూసుకుంటే కనుక ఎవరి కుర్చీ కిందకు నీళ్ళు వస్తాయో ఎవరికి ఎరుక అని అంటున్నారు. ఆ మధ్యన జరిగిన ప్రచారం బట్టి ఉత్తరాంధ్రాలో ఒకరిద్దరు మంత్రులు వెనకబడి ఉన్నారని అనుకున్నారు.

అలాగే రాయలసీమలో ఒకరిద్దరి పనితీరు మీద పెదవి విరుపులు వినిపించాయని అనుకున్నారు. అలాగే కోస్తాలో కూడా ఒకరిద్దరి మీద కొంత అసంతృప్తి ఉందని చెప్పుకున్నారు. గోదావరి జిల్లాలలో ఒక మంత్రి గారి విషయంలో కూడా అదే రకమైన భావన ఉందని ప్రచారం సాగింది.

ఈ విధంగా లెక్కలు కనుక తీస్తే కచ్చితంగా ఒక అరడజను మంది మత్రుల విషయంలో తీవ్రమైన కసరత్తు జరుగుతుందని అంటున్నారు. వారిని తప్పించి ఆ ప్లేస్ లో వేరే వారికి చోటు ఇవ్వవచ్చు అని కూడా ప్రచారం సాగుతోంది. కేవలం నాగబాబుకు మాత్రమే మంత్రి పదవి అంటే అది వేరే రాజకీయ సంకేతాలు ఇస్తుందని అందువల్ల పూర్తి స్థాయిలో కాకపోయినా పాక్షికంగా అయినా పునర్వ్యవస్థీకరణ చేపడతారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

ప్రస్తుతానికి చూస్తే కనుక పొలిటికల్ గా హీటెక్కించే న్యూస్ గానే ఈ ప్రచారాన్ని చూస్తున్నారు. ఉగాది వేళ నాగబాబు మంత్రి అవడం అంటూ జరిగితే మొత్తం తేనెతుట్టెను కదిపే ప్రయత్నం కూడా జరిగినట్లే అని అంటున్నారు. సో వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News