మళ్లీ గెలిచిన త్రిష..జారిన నోటనే క్షమాపణలు!
రాజుపై ఎవరి స్టైల్లో వారు చెలరేగారు. దీంతో దెబ్బకి ఆరోపణలు చేసిన నోటనే ఆమె వజ్రం అంటూ బయటకు వచ్చింది.
మళ్లీ గెలిచిన త్రిష..జారిన నోటనే మళ్లీ క్షమాపణలు తన్నుకుంటూ వచ్చాయి. తన తప్పేం లేదని..తప్పు చేసింది అంతా తానేని ఒప్పుకున్నాడంటే? త్రిషపై అక్కసుతో చేసిన పనికాక మరేమంటారు? అవును ఇప్పుడదే టాపిక్ ట్రెండింగ్ లోఉంది. 25 లక్షలిచ్చి త్రిషతో ఓ ఎమ్మెల్యే ఒప్పందం చేసుకున్నాడని అన్నాడీఎంకే నేత ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమయ్యాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రిషకి మద్దతుగా కోలీవుడ్ నటులంతా నిలిచిన సంగతి తెలిసిందే.
రాజుపై ఎవరి స్టైల్లో వారు చెలరేగారు. దీంతో దెబ్బకి ఆరోపణలు చేసిన నోటనే ఆమె వజ్రం అంటూ బయటకు వచ్చింది. త్రిష పై జరిగిన ఓ ప్రచారాన్ని తాను వక్రీకరించి ఆ రకంగా స్పందించినట్లు తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసాడు. ఆ వీడియోలో నటి త్రిషని క్షమించమని అడిగాడు. తన మాటలు వక్రీకరిం చారని తనకి త్రిషని టార్గెట్ చేసే ఉద్దేశం లేదని.. కొందరు తాను అన్న మాటలని వక్రీకరించారని ఆ వీడియోలో చెప్పాడు రాజు.
అలాగే దర్శకుడు చెరన్.. నటుడు కరుణాస్ కి కూడా క్షమాపణలు చెప్పాడు. దీంతో వివాదం సద్దు మణిగింది. ఈ విషయంలో త్రిష సీరియస్ అయిన సంగతి తెలిసిందే. చట్టపరంగా చర్యలు తీసు కుంటున్నట్లు పేర్కోంది. మరి తాజాగా రాజు క్షమాపణలు నేపథ్యంలో త్రిష చర్యలు ఎలా ఉంటాయి? అన్నది చూడాలి. రాజు క్షమాపణలతో త్రిష మరోసారి గెలిచినట్లు అయింది. మన్సూర్ అలీఖాన్ ఈ మధ్యనే త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ విషయంలో చిరంజీవి కూడా కల్పించుకుని త్రిషకు మద్దతు ప్రకటించారు. ఇంకా మరికొంత మంది హీరోలు త్రిషకి మద్దతుగా నిలిచారు. కొన్ని రోజుల పాటు మన్సూర్ అలీఖన్- త్రిష మధ్య వివాదం తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. చివరికి త్రిష తప్పులేదని తేల్చిన కోర్టు మన్సూర్ అలీఖాన్ కి చీవాట్లు పెట్టింది. దీంతో మన్సూర్ అలీఖాన్ త్రిషకి పబ్లిక్ గానే క్షమాపణలు చెప్పడంతో వివాదం ఓ కొలిక్కి వచ్చింది. అయితే ప్రతీ సారి త్రిషనే ఎందుకు టార్గెట్ అవుతుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్నా వాళ్లెవ్వరి పేర్లు ఇలాంటి వివాదాల్లో తెరపైకి రాలేదు. తప్పు చేయకపోయినా కేవలం త్రిషనే హాట్ టాపిక్ గా మారుతుంది.