వీడిన ఎయిరిండియా విమానం ఉత్కంఠ... ఏమిటీ బెల్లీ ల్యాండింగ్?

సుమారు 141 మంది ప్రయాణికులతో ఉన్న ఎయిరిండియా విమానం గాల్లో ఉండగా... పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు.

Update: 2024-10-11 15:10 GMT

సుమారు 141 మంది ప్రయాణికులతో ఉన్న ఎయిరిండియా విమానం గాల్లో ఉండగా... పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. హైడ్రాలిక్ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని గుర్తించిన పైలట్లు.. తిరుచ్చి విమానాశ్రయాన్ని అప్రమత్తం చేశారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

అవును.. ఎయిరిండియా విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ ప్రకటించారు. తమిళనాడులోని తిరుచ్చి మీదుగా వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో సుమారు గంటన్నర సమయం వరకూ విమానం గాలో చక్కర్లు కొట్టిందనే విషయం తీవ్ర భయాందోళనలు కలిగించింది. ఈ సమయంలో ఎయిర్ పోర్టులో హైటెన్షన్ సిట్యుయేషన్ నెలకొంది.

మరోపక్క విమానాశ్రయానికి అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు రావడంతో అక్కడున్నవారిలోనూ తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. అయితే సుమారు రెండు గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం.. పైలట్లు చాకచక్యంగా ఎయిరిండియా విమానం బెల్లీ ల్యాండింగ్ పద్ధతిలో సేఫ్ గా ల్యాండింగ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదే సమయంలో ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే ప్రమాద తీవ్రతను తగ్గించేందుకన్నట్లుగా విమానాశ్రయంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా... 20 ఫైరింజన్లు, 20 అంబులెన్సులతోపాటు పారామెడికల్ స్టాఫ్ ని సిద్ధంగా ఉంచారు. అయితే ఎట్టకేలకు ఎయిరిండియా విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. దీంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కాగా... అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేయాలంటే మందుగా అందులో ఉన్న ఇంధనం నిర్దేశిత స్థాయి వరకూ తగ్గాల్సి ఊంటుంది.. అప్పుడే విమానం ల్యాండింగ్ చేసే వీలుంటుంది. ఈ నేపథ్యంలో.. సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించిన పైలట్లు సుమారు రెండు గంటలు తర్వాత సక్సెస్ అయ్యారు!

ఏమిటీ బెల్లీ ల్యాండింగ్..?:

హైడ్రాలిక్ సిస్టంలో సమస్య ఏర్పడినప్పుడు.. అంటే.. విమానం చక్రాలు తెరుచుకోని సమస్య ఏర్పడినప్పుడు.. సేఫ్ ల్యాండింగ్ చేయడం అంత ఈజీ కాదని అంటారు! ఈ సమయంలో విమానాన్ని ల్యాండింగ్ చేసే విధానాన్నే బెల్లీ ల్యాండింగ్ అంటారు. ఈ సమయంలో కచ్చితత్వం ఏమాత్రం మిస్ అయినా... తీవ్ర నష్టం జరుగుతుందని చెబుతున్నారు.

ఇందులో భాగంగా... బెల్లీ ల్యాండింగ్ వల్ల విమానం ముక్కలు ముక్కలు అయ్యే అవకాశాలు ఉన్నాయని.. ఆ సమయంలో రాపిడి వల్ల మంటలు వ్యాపించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతుంటారు. అందుకే... ఈ ల్యాండింగ్ ఆలోచన ఉన్నప్పుడు ముందుగా ఇందనాన్ని ఖాళీ చేసేస్తారు.

ఆ తర్వాత విమానాన్ని భూమికి సమానంగా వీలైనంత మేర తీసుకురావాల్సి ఉంటుంది. అంటే... రన్ వే లెవెల్ కు దాదాపు సమానంగా అన్నమాట. అలా తీసుకొచ్చాక విమానాన్ని నేరుగా ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. ఇది కరెక్ట్ గా జరిగితే ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా బయటపడవచ్చు.

తాజాగా తిరుచ్చి నుంచి షార్జా వెళ్లే ఏ.ఎక్స్.బీ-613 ఎయిరిండియా విమానం ల్యాండింగ్ విషయంలో పైలైట్లు ఇదే ఆప్షన్ ఎంచుకుని, చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు! ఈ సందర్భంగా ఆ పైలట్లను అంతా అభినందిస్తున్నారు.

Tags:    

Similar News