రన్‌వే పైనుంచి చెట్లపొదల్లోకి విమానం.. చివరకు ఏం జరిగిందంటే?

48 మందితో టేకాఫ్ అయిన విమానం ఒక్కసారిగా రన్‌వేపై అదుపుతప్పింది.

Update: 2024-09-09 10:50 GMT

48 మందితో టేకాఫ్ అయిన విమానం ఒక్కసారిగా రన్‌వేపై అదుపుతప్పింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో విమానంలోపల ఉన్న వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని గడిపారు. అదుపుతప్పి సమీపంలోని చెట్లలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఇండోనేషియాలో పపువా రీజియన్ యాపిన్ ద్వీపంలో 48 మందితో ఏటీఆర్-42 విమానం టేకాఫ్‌నకు సిద్ధమైంది. ఆ సమయంలో రన్‌వేపై అదుపు తప్పింది. ప్రమాదం సమయంలో 42 మంది ప్రయాణికులు, ఓ పాపతోపాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. కొంతమంది గాయపడిన ప్రయాణికులను మాత్రం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ఒకసారి జరిగితే పొరపాటు అనుకుంటారు.. రెండో సారి జరిగితే తప్పిందం అంటుంటారు.. అదే మూడో జరిగితే..? ఇప్పుడు ఇండోనిషియా ఎయిర్‌లైన్స్ అలాంటి విమర్శలను ఎదుర్కొంటోంది. విమానాల విషయంలో అక్కడి ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఏటా అవి ప్రమాదాలకు గురవుతున్నాయి. దీనికి తోడు ప్రకృతి విపత్తులతోనూ ఆ సంస్థ విమర్శలపాలవుతోంది.

అందుకే.. ఇండోనేషియా వినానయానం ఆసియాలోనే అత్యంత చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఏటా ఇండోనేషియా విమానాలు ఏదో ఒక ప్రమాదంలో చిక్కుకొని పదుల సంఖ్యో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. 1945 నుంచి ఇప్పటివరకు సుమారుగా వందకు పైగా ప్రమాదాలు జరిగాయి. వీటిలో 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఏవియేషన్ సేఫ్టీ నెట్‌వర్క్ డేటా చెబుతోంది. 2015లో త్రిగన విమానం కూలిపోయి 54 మంది చనిపోయారు. అందుకే.. ఆసియాలోనే అత్యంత ప్రమాదకరమైన ఎయిర్‌లైన్స్‌గా ఈ సంస్థ పేరుగాంచింది. 1990లో చాలాకాలం నియంతృత్వం తర్వాత ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థను పెట్టుబడుల కోసం ఆహ్వానించింది. దాంతో వైమానిక వ్యవస్థలో చాలా వరకు పెట్టుబడులు వచ్చాయి. ఆ సమయంలో రూల్స్ పెద్దగా పట్టించుకోలేదు. భద్రత కరువై ఈ ప్రమాదాలు సంభవిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News