ఏఐతో 'ఆప్తుల జ్ఞాపకాలు' పదిలం..!
అయితే.. ఇప్పుడు మానసికంగా సంతృప్తి చెందాల్సిన అవసరం లేదట. కృత్రిమ మేథ(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్-ఏఐ) ద్వారా ఇప్పుడు ఆప్తుల జ్ఞాపకాలను పదిలం చేసుకోవచ్చని అంటున్నారు పరిశోధ కులు.
తల్లయినా.. తండ్రైనా.. పిల్లలకు దశ, దిశ చూపించే జీవిత పథ నిర్దేశకులు. అయితే.. కాల గతిలోఏదో ఒక నాడు వీరిని కోల్పోక తప్పదు. వీరినే కాదు.. మనకు ఆప్తులు అనుకున్నవారిని కూడా కోల్పోవడం తప్పదు. కానీ.. వారి జ్ఞాపకాలు.. మధుర స్మృతులు.. మాత్రం మనకు కొన్ని జీవితాంతం గుర్తుంటాయి. మరికొన్నిం టిని కాలక్రమేణా మరిచిపోతుంటాం. ఇది సహజం కూడా. కానీ, కొందరు జీవితాంతం అన్నీ గుర్తు పెట్టుకో వాలని.. కోల్పోయిన ఆప్తులు తమతోనే ఉండాలని కోరుకుంటారు. అలా వారు ఉన్నట్టే మానసికంగా కూడా భావిస్తారు.
అయితే.. ఇప్పుడు మానసికంగా సంతృప్తి చెందాల్సిన అవసరం లేదట. కృత్రిమ మేథ(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్-ఏఐ) ద్వారా ఇప్పుడు ఆప్తుల జ్ఞాపకాలను పదిలం చేసుకోవచ్చని అంటున్నారు పరిశోధ కులు. మనుషులను ఏఐ చాట్‌బాట్‌లుగా మార్చేందుకు.. సాంకేతికంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. దీనిలో ప్రధానంగా ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నారు. దక్షిణ కొరియాకు చెందిన 'డీప్‌బ్రెయిన్ ఏఐ' మనుషుల వీడియో, ఆడియోలను చిత్రీకరించి, వారి ముఖం, వాయిస్, ప్రవర్తనను క్యాప్చర్ చేసి, ఆ తర్వాత ఆ మనిషి వీడియో-ఆధారిత అవతార్‌ను సృష్టిస్తుంది.
అయితే.. ఈ ప్రయోగం కొంత డబ్బుతో ముడిపడి ఉంటాయని డీప్‌బ్రెయిన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మైఖేల్ జంగ్ చెప్పారు. ఏఐతో సృష్టించే అవతార్ కోసం సుమారు రూ.40 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. అయినప్పటికీ.. ఆప్తుల కోసం ఆమాత్రం ఖర్చె పెట్టేందుకు ముందుకు వస్తున్నవారు కూడా ఎక్కువగా ఉన్నారని ఆయన చెబుతున్నారు.
ఎలా మొదలైంది?
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉండే జేమ్స్‌కు తన తండ్రిపై ఎంతో ప్రేమ. ఆయన జీవించి ఉన్నకాలం లో ఆయన పక్కనే కూర్చుని అనేక విషయాలు నేర్చుకున్నారు. ఇంకా ఏవో నేర్చుకోవాలని కూడా అను కున్నారు. కానీ, 2017లో తండ్రిని కోల్పోయారు. దీంతో ఆయన మానసికంగా కుంగిపోయినా.. ఆ వెంటనే అప్పుడు అందుబాటులోకి వస్తున్న ఏఐని అందిపుచ్చుకున్నారు. దీని ద్వారా.. చాట్‌బాట్‌ను రూపొందిం చి.. దీని నుంచి ఇంటరాక్టివ్ టెక్నాలజీనిరూపొందించారు. తన తండ్రి జ్ఞాపకాలను, ఆయన వ్యక్తిత్వంలో కొంత భాగాన్ని కూడా చాట్‌బాట్ ద్వారా వింటున్నారు. అచ్చం తన తండ్రి సమక్షంలోనే ఉన్నట్టుగా ఉందని జేమ్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.