మందుబాబులకు గుడ్ న్యూస్... మద్యం ధరలు తగ్గించిన కంపెనీలు!

వైసీపీ హయాంలో బేసిక్ ప్రైస్ ను భారీగా పెంచేసిన మద్యం సరఫరా కంపెనీల్లో కొన్ని కీలక నిర్ణయం తీసుకున్నాయని అంటున్నారు.

Update: 2024-12-21 08:27 GMT

ఏపీలో గత ప్రభుత్వ హయాంలోని లిక్కర్ పాలసీపై తీవ్ర విమర్శలు వచ్చాయని.. 2024 ఎన్నికల ఫలితాల్లో దాని ప్రభావం కూడా స్పష్టంగా కనిపించిందనే కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ప్రధానంగా మద్యం బేసిక్ ప్రైస్ భారీగా పెరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మందుబాబులకు మద్యం కంపెనీలు ఓ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది.

అవును.. వైసీపీ హయాంలో బేసిక్ ప్రైస్ ను భారీగా పెంచేసిన మద్యం సరఫరా కంపెనీల్లో కొన్ని కీలక నిర్ణయం తీసుకున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... కొన్ని కంపెనీలు మద్యం ధరలను వాటంతట అవే తగ్గించుకున్నాయని తెలుస్తోంది. ఈ జాబితాలో సుమారు 11 కంపెనీలు ఉన్నాయని.. ఇవన్నీ బేసిక్ ప్రైస్ తగ్గించుకుంటున్నాయని చెబుతున్నారు.

వాస్తవానికి గతంలో వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఆయా కంపెనీల నుంచి కమిషన్లు తీసుకునేందుకు వీలుగా అన్నట్లుగా వాటికి చెల్లించే బేసిక్ ప్రైస్ ని భారీగా పెంచేశారనే ఆరోపణలు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు, ఫిర్యాదులూ వచ్చాయని అంటారు. ఈ సమయంలో పలు కంపెనీలు వాటికవే బేసిక్ ప్రైస్ తగ్గించుకున్నాయని అంటున్నారు.

ఈ క్రమంలో సుమారు 11 కంపెనీలు వాటి వాటి బేసిక్ ప్రైస్ ను తగ్గించుకున్నాయని.. వాటికవే ఈ నిర్ణయం తీసుకున్నాయని.. ఫలితంగా... ఆయా కంపెనీల నుంచి రాష్ట్రం కొనే ధర తగ్గిందని అంటున్నారు. ఫలితంగా.. ఆయా బ్రాండ్లను బట్టి ఒక్కో క్వార్టర్ ధర ఎమ్మార్పీపై సుమారు రూ.30 వరకూ తగ్గనుందని చెబుతున్నారు.

Tags:    

Similar News