జగన్ తీసుకొచ్చిన విధానం రద్దు... కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలివే!

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Update: 2024-08-28 10:04 GMT

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా... ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు. తిరిగి పాతవిధానంలొనే టెండర్లు పిలిచే ప్రతిపదనకు కేబినేట్ తాజాగా ఆమోదం తెలిపింది.

అవును... ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా... ప్రధానంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు. ఇదే క్రమంలో.. అబ్కారీ శాఖ పునర్ వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే క్రమంలో... స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్.ఈ.బీ) రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఇదే క్రమంలో... రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటో తొలగింపుతో పాటు సుమారు 77 లక్షల సర్వే రాళ్లపై ఉన్న జగన్ బొమ్మను తొలగించాలని నిర్ణయించారు! ఇదే క్రమంలో... పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు ఏపీ కేబినెట్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఇదే క్రమంలో ఈ పనుల్లో ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ సంస్థనే కొనసాగించాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా... సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే... భూముల వివదాలపై రెవెన్యూ సదస్సుల నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది!

రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి..?

ప్రభుత్వం చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలను వివిధ కాంట్రాక్టు సంస్థల ద్వారా చేయించడానికి టెండర్లు పిలుస్తారనే సంగతి తెలిసిందే. ఇందులో ఓపెన్ టెండర్లు, బిడ్డింగ్ టెండర్లతో సహా పలు విధానాలను అవలంభిస్తుంటారు. ఇటీవల కాలంలో ఆన్ లైన్ లోనూ టెండర్లు నిర్వహిస్తున్నారు.

వాస్తవానికి ఓ ప్రాజెక్ట్ కాంట్రాక్టుని ఏదైనా సంస్థకు అప్పగించిన తర్వాత ప్రభుత్వం ఏ కారణం చేతనైనా సంతృప్తి చెందకపోతే.. పాత టెండర్లను రద్దు చేసే అధికారం ఉంటుంది. దీంతో.. మళ్లీ టెండర్లను పిలుస్తారు. ఈ విషయంలో ఏ విధానాన్ని ఐనా అవలంభించే స్వేచ్ఛ కూడా ప్రభుత్వానికి ఉంటుంది.

అయితే... పాతపద్దతిలోనే.. అదే కాంట్రాక్టుని అంతకంటే తక్కువకు నిర్వహించాలని నిర్ణయించి మళ్లీ టెండర్లు పిలవడాన్నే రివర్స్ టెండరింగ్ అంటారు. మొదటిసారి పిల్చినప్పుడు టెండర్లో అవకతవకలు జరిగాయనే నిర్ధారణకు వచ్చినప్పుడు.. లేదా, ఆ పనిని మరింత చౌకగా చేసే అవకాశంఉందని భావించినప్పుడు ఈ రివర్స్ టెండరింగ్ కి పిలుస్తారు.

Tags:    

Similar News