చంద్రబాబుకు అరుదైన గౌరవమిచ్చిన 'ది కారవాన్'
ఇది ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా ఇది మరోసారి నిరూపితమైంది.
భారతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు వంటి అనుభవం , 40 ఏళ్ల రాజకీయ జీవితం అవగాహన కలిగిన నేతలు చాలా అరుదుగా కనిపిస్తారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నప్పటికీ, ఆయన ఇప్పటికీ అంతే ప్రాశస్త్యంగా కొనసాగుతున్నారు. ఇది ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా ఇది మరోసారి నిరూపితమైంది.
ఈ నేపథ్యంలో ప్రముఖ జాతీయ మీడియా పత్రిక అయిన "ది కారవాన్" చంద్రబాబుపై ఒక వినూత్న కవర్ స్టోరీను ప్రచురించింది. ఈ ప్రముఖ పత్రిక ఫిబ్రవరి సంచిక కవర్‌పై చంద్రబాబును పెట్టి గౌరవం కల్పించింది. క్యాప్షన్ గా “ది డిస్క్రీట్ చార్మ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు” అని రాసుకొచ్చింది..
ఈ కవర్ స్టోరీ చంద్రబాబుపై ప్రధానమైన విశేషాలను విపులంగా వివరిస్తూ ముఖ్యంగా 2015లో అమరావతి శంకుస్థాపన వేడుక వంటి చారిత్రాత్మక ఘట్టాలను ప్రస్తావిస్తుంది. "చంద్రబాబు మోదీకి చుట్టూ చూపిస్తూ ఉండగా, ఆయన ఒక విద్యార్థిలా, చంద్రబాబు ప్రధానోపాధ్యాయుడిలా కనిపించారు" అని కథనంలో ప్రముఖంగా ప్రచురించింది. ఇది చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, కేంద్ర స్థాయిలోనూ ఎంత ప్రాధాన్యత కలిగిన నేతనో అర్థమయ్యేలా చాటిచెప్పింది.
సమకాలీన రాజకీయ నాయకులు పత్రికల కవర్‌పేజీలకు ఎక్కడ చాలా అరుదుగా జరుగుతుంది. అయితే చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన, ప్రజాదరణ పొందిన నాయకుడు ఇలా అనూహ్యంగా ప్రముఖ శీర్షికలతో ది కారవన్ కవర్ పేజీపైకి ఎక్కడం నిజంగా ఆసక్తికరమైన విషయం.