బొత్స మాట ఎంతవరకూ చెల్లుబాటు....?

విజయనగరం జిల్లా వరకూ చూస్తే వైసీపీలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద రాయుడే అని చెప్పాలి

Update: 2023-08-17 03:49 GMT

విజయనగరం జిల్లా వరకూ చూస్తే వైసీపీలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద రాయుడే అని చెప్పాలి. ఆయన మాటే శాసనం అని కూడా అంటారు. అందుకే 2019 ఎన్నికల్లో ఆయన ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీట్లో అంతా బొత్స తన వారిని సన్నిహితులను బంధువులను తీసుకున్నారు. దాంతో విజయనగరం ఖిల్లా మీద బొత్స జెండా ఎగిరింది.

దానికి జగన్ వేవ్ కూడా తోడు అయి విజయనగరం జిల్లా క్లీన్ స్వీప్ చేసి పారేసింది వైసీపీ. మళ్లీ అలాంటి పరిస్థితి 2024లో ఉంటుందా అన్నదే చూడాల్సి ఉంది అంటున్నారు. ఇక బొత్స మాట ఈసారి ఎంత మేరకు చెల్లుబాటు అవుతుంది అన్నది కూడా ఇక్కడ పాయింట్. ఈసారి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు కీలకం అవుతున్నారు. పైగా ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ కం వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ కూడా.

దాంతో విజయనగరం జిల్లా వ్యవహారాలు మెల్లగా సత్తిబాబు నుంచి మేనల్లుడు చిన్న శ్రీను గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నాయా అన్న చర్చ వస్తోంది. ఇక వైసీపీ హై కమాండ్ కూడా ఈసారి పాత వారిని మార్చేసి గెలుపు గుర్రాలను కొత్త ముఖాలను రంగంలోకి దించాలని చూస్తోంది అని అంటున్నారు.

దాంతో బొత్స వర్గానికి ఎన్ని టికెట్లు వస్తాయన్నది చర్చగా ఉంది. గజపతినగరంలో బొత్స తమ్ముడు అప్పలనరసయ్య ఉన్నారు. ఆయనకు ఈసారి టికెట్ ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు. ఎందుకంటే పనితీరు విషయంలో ఆలోచించాల్సిందే అని నివేదికలు చెబుతున్నాయట. పైగా అక్కడ టీడీపీ బలపడుతోంది. జనసేన గ్రాఫ్ పెరిగింది. దాంతో క్యాండిడేట్ ని మార్చాలనుకుంటే తమ్ముడికి బొత్స సీటు దక్కించుకోలేకపోతారు అని అంటున్నారు

అలాగే విజయనగరం ఎంపీ సీటు విషయంలో బొత్స తన మాటను నెగ్గించుకోవాలని అనుకుంటున్నారు. మరి హై కమాండ్ ఎవరిని బరిలోకి దించుతుందో చూడాలని అంటున్నారు. ఏకంగా బొత్స మేనల్లుడికే ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచన కూడా ఉంది అని అంటున్నారు. అలా చేసి ఎంపీ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సీట్లలో వైసెపీని గెలిపించుకునేలా వైసీపీ ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది అని అంటున్నారు.

ఇక బొబ్బిలిలో బొత్స సన్నిహితుడుగా ఉన్న శంబంగి చిన అప్పలనాయుడు టికెట్ కూడా డౌటే అంటున్నారు. అలాగే ఎస్ కోటలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కె శ్రీనివాసరావు టికెట్ కి టిక్కు పెడతారు అని అంటున్నారు దీంతో బొత్స కొత్త వారిని అయినా దింపి తన హవా చాటుకుంటారా లేక హై కమాండ్ చెప్పిన వారికే మద్దతు ఇస్తారా అన్నది చూడాలి. మరో విషయం ఎంటి అంటే బొత్స శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఇంచార్జిగా ఉన్నారు.

దాంతో అక్కడ కూడా టికెట్ల విషయంలో బొత్స మీద వత్తిడి వస్తోంది. తూర్పు కాపులు బలంగా ఉన్న పాతపట్నం, శ్రీకాకుళం వంటి సీట్లలో ఆయా వర్గం నేతలు బొత్సను కలుస్తున్నారు. దాంతో బొత్స ఏ రకంగా వారికి టికెట్లు ఇప్పిస్తారు అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా బొత్సకు ఉత్తరాంధ్రాలో బాధ్యతలను అప్పగిస్తూ వస్తున్న వైసీపీ హై కమాండ్ ఈసారి ఎలాంటి రాజీ లేకుండా గెలుపు గుర్రాలకే టికెట్లు అంటోంది. దాంతో బొత్స గెలుపు గుర్రాల జాబితాను రెడీ చేయాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News