క్షమాపణలపైన టీటీడీ చైర్మన్ కామెంట్స్ వైరల్ !

తప్పు ఎక్కడో ఒక చోట జరిగింది. దానికి అందరూ బాధ్యత తీసుకోవాలి. ఇది సమిష్టి బాధ్యత.

Update: 2025-01-10 17:20 GMT

తప్పు ఎక్కడో ఒక చోట జరిగింది. దానికి అందరూ బాధ్యత తీసుకోవాలి. ఇది సమిష్టి బాధ్యత. ఎవరూ బాధ్యత తీసుకోకపోతే రాజు గారు ఏడు చేపల కధ అవుతుంది అన్నది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు. క్షమాపణ చెప్పినంత మాత్రాన తగ్గి నంత మాత్రాన పోయేది ఏమీ లేదని కానీ ప్రజలు అన్నీ గమనిస్తారని ఆయన అన్నారు.

అయితే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లేటెస్ట్ గా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో దీని మీద మీడియా ప్రశ్నించింది. బాధిత కుటుంబాలకు టీటీడీ క్షమాపణలు చెబుతుందా అన్న దానికి ఆయన బదులిస్తూ క్షమాపణలు చెబితే పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా అన్నారు. అయినా తప్పు ఎక్కడ జరిగింది అన్నది చూసుకుని దానిని సరిద్దుకోవాల్సి ఉందని అన్నారు.

ఈ విషయంలో ఎంక్వైరీకు ప్రభుత్వం అదేశించిందని ఆయన గుర్తు చేశారు. అధికారుల మధ్య కో ఆర్డినేషన్ లోపమని విమర్శల పట్ల అన్నీ మనమే ముందు అనుకుంటే ఇక విచారణ ఎందుకని ఆయన ప్రశ్నించారు. పొరపాట్లు ఎక్కడ జరిగాయో చూడడానికే విచారణ అన్నారు. ఆ నివేదిక కోసం అంతా చూడాలని అన్నారు.

ఇదిలా ఉంటే టోకెన్ల జారీ కోసం ఎనిమిది నుంచి తొమ్మిది కౌంటర్లు ఏర్పాటు చేశామని అందులో అన్నీ బాగానే పనిచేశాయని ఒక చోట మాత్రమే ఇలా జరిగిందని ఆయన అన్నారు. జరిగిన దాని మీద పూర్తి విచారణ జరిపిస్తున్నామని అందులో వచ్చిన అంశాల ఆధారంగా బాధ్యుల మీద చర్యలు ఉంటాయని నాయుడు స్పష్టం చేశారు.

ఇవన్నీ పక్కన పెడితే క్షమాపణ చెప్పినంత మాత్రాన చనిపోయిన వారి ప్రాణాలు తిరిగి రావు అని ఆయన మొదట అన్నారు ...ఆయినా కూడా బోర్డు తరుపున క్షమాపణలు చెప్పారు .



Full View


Tags:    

Similar News