జగన్ పిక్ పాయే... ఏపీలో పాస్ పుస్తకాల కొత్త లుక్ చూశారా?
ఈ నేపథ్యంలో... తాజాగా జరిగిన రెవిన్యూ శాఖ సమీక్షా సమావేశంలో చంద్రబాబు వీటిని చూపించారు. త్వరలో వీటిని రైతులకు ఇవ్వనున్నారు!
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా జగన్ ఫోటోలు ముద్రిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. స్కూలు పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే బ్యాగుల నుంచి రైతులకు ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాల వరకూ, సరిహద్దు రాళ్లకు సైతం జగన్ ఫోటోలు ముద్రించారనే వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
ఇక ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో తెరపైకి తెచ్చిన సందేహాలకు తోడు.. పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు ఉన్న విషయం రైతుల్లో మరిన్ని సందేహాలు నెలకొనడానికి కారణమైంది. ఫలితంగా... ఈ విషయం తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో.. తాము అధికారంలోకి వచ్చాక తిరిగి రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తామని హామీ ఇచ్చారు కూటమి నేతలు. అన్నట్లుగానే చేశారు!
అవును... ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం జగన్ ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తగా రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాల తయారీకి ఆర్డర్ చేశారు. అయితే తాజాగా అవి ప్రభుత్వానికి అందాయి. ఈ నేపథ్యంలో... తాజాగా జరిగిన రెవిన్యూ శాఖ సమీక్షా సమావేశంలో చంద్రబాబు వీటిని చూపించారు. త్వరలో వీటిని రైతులకు ఇవ్వనున్నారు!
ఇక, ఈ సమీక్షలో పెండింగ్ ఇళ్ల నిర్మాణం, ఈ నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై చంద్రబాబు అధికారులతో చర్చించారు. ఈ నేపథ్యంలో... రాష్ట్ర వ్యాప్తంగా భూఆక్రమణలపై విచారణకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు ఇచ్చింది. దీంతో.. ఈ ప్రతిపాదనలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ప్రభుత్వం సిద్దమతుందని తెలుస్తోంది.
ఇదే క్రమంలో... గత ఐదేల్లలో తెచ్చిన చట్టాలు, అవి దుర్వినియోగమైన తీరు, సంస్కరణల పేరుతో తెచ్చిన చట్టాలు, వాటి మాటున జరిగిన అక్రమాలు, భూ వివాదాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు.. భూ కబ్జాలు అరికట్టేందుకు కొత్త చట్టాలు తెచ్చే అంశాలపైనా చర్చించారని సమాచారం!