ఆ 15 మంది అదృష్ట వంతులు ఎవ‌రో? కాంగ్రెస్‌లో చ‌ర్చ‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ విడ‌త‌ల వారీగా అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు విడ‌త‌లుగా కాంగ్రెస్ పార్టీ జాబితాలు విడుద‌ల చేసింది.

Update: 2023-10-28 08:30 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ విడ‌త‌ల వారీగా అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు విడ‌త‌లుగా కాంగ్రెస్ పార్టీ జాబితాలు విడుద‌ల చేసింది. ఈ నెల 15న 55 మందితో కూడిన అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేసిన త‌ర్వాత‌.. కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాల పెల్లుబుకింది. దీనిని స‌ర్దుబాటు చేసుకుని.. పార్టీనాయ‌కులు ముందుకు సాగారు. కుటుంబంలో ఒక్క‌రికే టికెట్ అంటూనే ఇద్దరేసికి టికెట్ ఇవ్వ‌డంపై కొంద‌రు నాయ‌కులు నిప్పులు చెరిగారు.

అయిన‌ప్ప‌టికీ.. అసంతృప్తుల‌ను బుజ్జ‌గిస్తూ.. కొత్త‌వారిని తీసుకుంటూ.. కాంగ్రెస్ పార్టీ తాజ‌గా 45 మందితో రెండో జాబితాను కూడా విడుద‌ల చేసింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ 100 స్థానాల‌ను ఖ‌రారు చేసింది. ఇక‌, మ‌రో 19 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయాల్సి ఉంది. అయితే.. ఉమ్మ‌డి ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌ జిల్లాల్లో క‌మ్యూనిస్టుల‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది.

ఈ క్ర‌మంలో క‌మ్యూనిస్టుల‌కు చెరో రెండు స్థానాల‌ను కేటాయించాల‌ని నిర్ణ‌యించింది. అయితే.. ఏయే స్థానాల‌నేది మాత్రం ఇంకా ఖారారు కావాల్సి ఉంది. ఇవి పోగా.. మ‌రో 15 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయాల్సి ఉంది. అయితే.. ఈ 15 స్థానాల నుంచి కూడా ఒక్కొక్క‌స్థానానికీ ఇద్ద‌రు నుంచి న‌లుగురు అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. దీంతో అటు అధిష్టానానికి.. ఇటు రాష్ట్ర నాయ‌క‌త్వానికి కూడా త‌ల‌నొప్పిగా మారింది.

అయినా.. వీరి విష‌యంలో ఒకింత ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించింది. గెలుపు గుర్రాల‌కే అవ‌కాశం ద‌క్కుతాయ‌ని.. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. దీంతో ఆ 15 మంది అదృష్ట వంతులు ఎవ‌రో? అనే చ‌ర్చ కాంగ్రెస్‌లో జోరుగా సాగుతోంది

Tags:    

Similar News