వైసీపీకి కలసిరాని నానీలు !

వైసీపీలో ఒకనాడు అంతా నానీల మయం. ఎటు చూసినా నానీలే. ఏకంగా ముగ్గురు నానీలను తీసుకుని వచ్చి మంత్రులుగా చేశారు వైఎస్ జగన్.

Update: 2025-02-07 03:51 GMT

వైసీపీలో ఒకనాడు అంతా నానీల మయం. ఎటు చూసినా నానీలే. ఏకంగా ముగ్గురు నానీలను తీసుకుని వచ్చి మంత్రులుగా చేశారు వైఎస్ జగన్. అది కూడా తొలి విడతలోనే వారికి చాన్స్ దక్కింది. దాదాపుగా మూడేళ్ళ పాటు వారు అధికారంలో కొనసాగారు. ఇందులో ఇద్దరు నానీలు అయితే ఫైర్ బ్రాండ్స్ గా ముద్ర పడ్డారు. ఈ నానీల త్రయం వైసీపీకి ఒకనాడు ప్లస్ పాయింట్ గా ఉండేది.

ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో కొడాలి నాని బిగ్ వాయిస్ గా వైసీపీకి నిలిచారు. ఆయన మీడియా ముందుకు వచ్చారు అంటే విపక్షాన్ని తనదైన మాటలతో చీల్చి చెండాడేవారు. ఆయన నోటి దూకుడు విమర్శలకు తావు ఇచ్చినా ఆయన మాత్రం ఎక్కడా తగ్గేవారు కాదు, జగన్ మీద ఈగ వాలనీయకుండా చూసుకునేవారు. ఎంతటి వారు అవతల ఉన్నా ఈజీగా కామెంట్స్ చేసేవారు.

అలా వైసీపీ క్యాడర్ కి ఆయన పవర్ లో ఉన్నపుడు ఎంతో పవర్ ఫుల్ గా ఒక పెద్ద పొలిటికల్ ఎసెట్ గా నిలిచేవారు. ఇక అదే జిల్లాకు చెందిన పేర్ని నాని వెటకారం తో విపక్షాల మీద విరుచుకుని పడే తీరు వేరే లెవెల్ అన్నట్లుగా ఉండేది. ఆయన చంద్రబాబు పవన్ ల మీద చేసే సెటైరికల్ కామెంట్స్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

డైలాగ్ వార్ అంటే పేర్ని నానే వైసీపీ నుంచి మొదట కనిపించేవారు. ఇక గోదావరి జిల్లాలకు చెందిన ఆళ్ళ నాని ఉప ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన వైఎస్సార్ కుటుంబానికి వైసీపీకి వీర విధేయుడిగా ఉండేవారు. ఆయన కూడా పార్టీకి ఆ ప్రాంతంలో బలంగా ఉంటూ వచ్చారు. ఈ ముగ్గురూ నానీలు చాలదన్నట్లుగా 2024 ఎన్నికల ముందు విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా వైసీపీలో చేరిపోయారు. దాంతో నానీలు అంతా ఒక్క చోటనే చేరారు అన్న కామెంట్స్ సరదాగా వినిపించాయి.

వీరిలో పేర్ని నాని తప్ప అంతా 2024 ఎన్నికల్లో పోటీ చేశారు ఓడారు, పేర్ని నాని తనయుడు పోటీకి దిగి ఓటమి పాలు అయ్యారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఓడిన వెంటనే నాకొద్దీ రాజకీయాలు అని కేశినేని నాని స్వస్తి పలికేసారు. ఇక ఆయన తరువాత ఆళ్ళ నాని అదే బాటలో నడిచారు వైసీపీకి దూరంగా ఉంటానని షాక్ ఇచ్చారు.

ఫైర్ బ్రాండ్ గా పేరు పడిన కొడాలి నాని అయితే అయిపూజా లేకుండా పోయారు. ఏపీలో వైసీపీ ఓడి ఎనిమిది నెలలు గడిచాయి కొడాలి నాని ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియడం లేదు. పేర్ని నాని మాత్రం ఇటీవల కాలం వరకూ మీడియా ముందుకు వచ్చి వైసీపీని కాసుకునేవారు అయితే ఆయన కుటుంబం మీద కేసులు పడడంతో ఆయన కూడా ఫుల్ సైలెంట్ అయ్యారు

ఈ మొత్తం పరిణామాలను చూస్తే కనుక వైసీపీ విపక్షంలో ఉన్న వేళ నానీలు మొత్తం కలసి రాకుండా పోయారు అన్న చర్చ సాగుతోంది. వీరంతా జగన్ కి అత్యంత సన్నిహితులుగా మెలిగేవారు. మీడియా ముందుకు వచ్చి జగన్ మీద విమర్శలు చేసే ప్రత్యర్ధులను గట్టిగా ఎదుర్కొనేవారు. ఇపుడు చూస్తే జగన్ లండన్ లో ఉంటే వైసీపీ నుంచి మాట్లాడేందుకు పెద్దగా వాయిస్ ఏదీ లేకుండా పోయింది.

మళ్ళీ జగనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడేంతవరకూ వైసీపీ గురించి వినే చాన్స్ కూడా క్యాడర్ కి లేకుండా పోయిదంటే నానీలూ ఎక్కడున్నారయ్యా అని అంతా అనుకునే పరిస్థితి అంటున్నారు. చూడాలి మరి ఫ్యూచర్ లో అయినా వీరిలో ఎవరైనా తిరిగి వైసీపీ తరఫున పెద్ద గొంతు చేస్తారేమో.

Tags:    

Similar News