జగన్ మీటింగులో ధర్మాన మిస్ ?

అయితే అందరి దృష్టి గైర్ హాజరు అయిన ప్రసాదరావు మీదనే ఉంది. ఆయన ఎందుకు రాలేదు అన్న చర్చ నడుస్తోంది.

Update: 2024-09-20 00:30 GMT

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా పెద్ద నేత, మాజీ మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు తాడేపల్లిలో జగన్ నిర్వహించిన జిల్లా స్థాయి రివ్యూ సమావేశానికి గైర్ హాజరు అయ్యారని అంటున్నారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ధర్మాన క్రిష్ణదాస్, సీదరి అప్పలరాజు, పుష్ప శ్రీవాణి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

అయితే అందరి దృష్టి గైర్ హాజరు అయిన ప్రసాదరావు మీదనే ఉంది. ఆయన ఎందుకు రాలేదు అన్న చర్చ నడుస్తోంది. వైసీపీ ఓటమి తరువాత ప్రసాదరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఈ మధ్యలో వచ్చిన వైఎస్సార్ జయంతి వర్ధంతి కార్యక్రమాలకు కూడా హాజరు కాలేదు అని చెప్పుకున్నారు.

ఆయన రాజకీయంగా వైరాగ్యంలో ఉన్నారు అని ఒక వైపు అంటూంటే ఆయన రాజకీయంగా ఎటు అడుగులు వేయాలి అన్నది ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ప్రసాదరావు ఆలోచనలు అన్నీ తన కుమారుడు రాజకీయ వారసుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మీదనే ఉన్నాయని అంటున్నారు.

ఆయనను ఏ పార్టీలో చేర్పిస్తే రాజకీయంగా నిలదొక్కుంటారు అని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. వైసీపీలో అయితే తమ రాజకీయ వారసుడికి రాజకీయ భవిష్యత్తు లేదని కలవరపడుతున్నారా అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో కుమారుడికి శ్రీకాకుళం శాసన సభ టికెట్ ని ప్రసాదరావు అడిగారు.

దానికి జగన్ నిరాకరించారు అన్న ఆవేదన ప్రసాదరావులో ఉంది అని అంటున్నారు. ఇక చూస్తే శ్రీకాకుళం టీడీపీకి కంచుకోట. ఇపుడు జనసేన కూడా తోడు అయింది. మొదట్లో కాంగ్రెస్ కానీ ఆ తరువాత వైసీపీ కానీ గెలిచింది తక్కువ సార్లే. దాంతో ఆయన వైసీపీ విషయంలో ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఆయన గైర్ హాజరు కావడం మాత్రం ఒక పెద్ద చర్చగా ఉంది అని అంటున్నారు. ఎందుకంటే జగన్ జిల్లాల వారీగా సమావేశాలు పెట్టింది కూడా ఎవరు పార్టీలో ఉంటారు, ఎవరు దూరం అవుతున్నారు అని తెలుసుకోవడానికే అని అంటున్నారు. ఆ విధంగా ఆయనకు క్లారిటీ వచ్చినట్లేనా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ధర్మాన ప్రసాదరావు సోదరుడు క్రిష్ణదాస్ వైసీపీలో కీలకంగా ఉన్నారు.

జగన్ ఆయనకే జిల్లా పగ్గాలు అప్పగించారు. కాబట్టి ఆయన ద్వారా తమ్ముడికి నచ్చచెప్పి పార్టీలో ఉండేలా చూస్తారు అని అంటున్నారు. అయితే మొదటి నుంచి వైసీపీలో క్రిష్ణ దాస్ ఉండగా ప్రసాదరావు 2014లో వచ్చి చేరారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావడంతో ఆయన అప్పట్లోనే పార్టీ మీద అపుడపుడు హాట్ కామెంట్స్ చేస్తూ ఉండేవారు. ఇక 2019లో ఆయన గెలిచినా మొదటి విడతలో మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన ప్రభుత్వంలో ఉంటూ కూఒడా పరోక్ష విమర్శలు చేస్తూ ఇరుకున పెట్టిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

ఈ విధంగా చూస్తే ధర్మాన ప్రసాదరావు వైసీపీలో కొనసాగుతారా అన్నది డౌటానుమానమే అని అంటున్నారు. ఆయన టీడీపీలో చేరుతారు అని ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఈ పుకార్లలో వాస్తవం ఎంతో కూడా వేచి చూస్తే తప్ప తేలదు.

Tags:    

Similar News