పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదో చెబుతోన్న వైసీపీ నేత.. కీలక ఆరోపణలు!
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాజకీయ ఒక్కసారిగా వేడెక్కినట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత రాజకీయ వాతావరణం వేడెక్కినట్లు కనిపిస్తోంది. తమకు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ పట్టుబడుతుంటే.. అలాగైతే జర్మనీ వెళ్లాలని పవన్ చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సంచలన ఆరోపణలు చేశారు.
అవును... ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాజకీయ ఒక్కసారిగా వేడెక్కినట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా... ప్రశ్నిస్తాను, ప్రశ్నిస్తాను, ప్రశ్నిస్తాను అని అని కబుర్లు చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారో.. ఏమైపోయారో తెలియడం లేదని అన్నారు.
ఇదే సమయంలో... ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నెలకు రూ.50 కోట్లు పవన్ కల్యాణ్ కు ఇస్తున్నారంట అని.. తాము ఏమి చేసినా ప్రశ్నించకుండా ఉండటానికి ఈ మొత్తం పవన్ కు ఇస్తున్నారంట అని దువాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. అందువల్లే పవన్ కల్యాణ్ ప్రశ్నించడం లేదని.. ఆయన గొంతు మూగబోయిందని విమర్శించారు.
తాను అధికారంలో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా ధమ్ముగా మాట్లాడుతున్నానని.. తాము అవినీతి, అక్రమాలు చేస్తే, ఒక్క రూపాయి లంచం తీసుకుంటే.. ఆ వివరాలు బయటకు తీసి, ధమ్ముంటే లోపల వేయాలని సవాల్ విసిరారు. ఎప్పుడో పవన్ కల్యాణ్ కు చెప్పు చూపించినందుకు తనను ఇప్పుడు స్టేషన్ కు పిలవడం కాదని అన్నారు.
ఈ సందర్భంగా... పవన్ గొంతు మూగబోయిన విషయాన్ని జనసైనికులు గ్రహించాలని.. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ సరెండర్ అయిపోయారని.. అందువల్ల ఇంక మాట్లాడరంట అని.. పవన్ కు ధమ్ములేదని దువ్వాడ ఫైర్ అయ్యారు!
ఇదే సమయంలో... జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడతానని, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుగుతున్నారని.. అదేమీ హోదా కాదని.. ప్రజల తరుపున సమస్యలు లేవనెత్తడం కోసమేనని అన్నారు. తాము ఇచ్చిన నవరత్నాలు అన్నీ అమలు చేశామని.. కూటమి మాత్రం సూపర్ సిక్స్ అని చెప్పి అమలు చేయడం లేదని.. వాటి గురించి ప్రశ్నిస్తామనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు.