ఎవరీ రుక్మిణి... జనసేనలో మంటలు...!
ఇక ఈ పసుపులేటి సందీప్ రాయల్ ఎవరు ఏంటి అంటే వాళ్ల అమ్మ పసుపులేటి పద్మావతి మహిళా నాయకురాలిగా పాపులర్ గా సీమ జిల్లాలలో జనసేన తరఫున ఉన్నారు.
జనసేన పార్టీ అంటే వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. ఆ విషయం అందరికీ తెలిసిందే. పవన్ తరువాత కొంచెం పవర్ తో నాదెండ్ల మనోహర్ ఉంటారు. మనోహర్ మంచి వక్త కాదు, రాజకీయ దూకుడు చూపించే నేత కాదు, ఆయన కాంగ్రెస్ ఏలుబడిలో జస్ట్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి డిప్యూటీ స్పీకర్ గా ఒక సారి స్పీకర్ గా పనిచేసిన వారు.
ఆ తరువాత మరో రెండు సార్లు పోటీ చేసి ఓడారు. ఆయన వ్యూహరచనా చాతుర్యం ఉన్న వారు అని పవన్ పక్కన పెట్టుకున్నారా అంటే దానికి మించి ఆయన నమ్మారు కాబట్టే పక్కన ఉంటున్నారు అనుకోవాలి. ఇంతకాలం పవన్ మీద ఎవరైనా విమర్శలు చేస్తే నాదెండ్ల మనోహర్ వల్లనే తాము ఇలా బయటకు రావాల్సి వచ్చిందని చెబుతూ ఉండేవారు.
ఆయన తమకూ పవన్ కి మధ్యన అడ్డూ అంటూ ఉంటేవారు. ఇపుడు చూస్తే సీన్ కాస్తా మారుతోంది. రుక్మిణి అని ఒకామె పేరు చెబుతున్నారు. ఆమె వల్లనే పవన్ తనను బయటకు పంపించారు అని రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందిన పసుపులేటి సందీప్ రాయల్ ఆరోపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన యూట్యూబ్ చానల్స్ కి వరసబెట్టి ఇంటర్యూలు ఇస్తూ జనసేనను ఒక్క లెక్కన చెరిగి పారేస్తున్నారు
ఇక ఈ పసుపులేటి సందీప్ రాయల్ ఎవరు ఏంటి అంటే వాళ్ల అమ్మ పసుపులేటి పద్మావతి మహిళా నాయకురాలిగా పాపులర్ గా సీమ జిల్లాలలో జనసేన తరఫున ఉన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో జెడ్పీటీసీ పదవికి జనసేన తరఫున పులివెందులలో నామినేషన్లు వేయించిన డేరింగ్ ఆమె సొంతం అని అప్పట్లోనే అంతా మెచ్చుకున్నారు. పవన్ స్వయంగా ఆమె గురినిచ్ పొగుడుతూ పద్మావతి లాంటి నాయకురాళ్ళు పది మంది ఉంటే ఏపీని ఊపేస్తాను అని కూడా చెబుతూ వచ్చారు.
మరి అలాంటి పద్మావతి ఆమె కుమారుడు సందీప్ ఇద్దరూ జనసేనకు దూరం అయ్యారు. ఇపుడు పవన్ కళ్యాణ్ మీద ఈ యువ నేత విమర్శలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని జనసేన సెంట్రల్ ఆఫీసులో రుక్మిణి అని ఒకామె ఉన్నారని ఆమె మాటతోనే అక్కడ అంతా నడుస్తోందని, ఆమెకు నచ్చని వారిని పవన్ తో చెప్పించి ఇలా తీయేంచేస్తున్నారని మండిపడ్డారు.
పార్టీ కోసం ఏడెనిమిదేళ్ళుగా పనిచేస్తున్న దేవరాజ్ అనే దివ్యాంగుడిని కూడా పక్కన పెట్టేశారు అని సందీప్ ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ పార్టీ ఒక కోటరీ చేతులలో కొందరు వ్యక్తుల చేతులలోనే ఉందని, జనసేన గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఒక బలమైన సామాజికవర్గం ఆశలు తీరకుండా జనసేన రాజకీయం సాగుతోందని సందీప్ రాయల్ అంటున్నారు.
అనంతపురం అర్బన్ లో పోటీ చేస్తాను అని పవన్ అంటూంటారని, ఈసారి అక్కడ నుంచి పోటీ చేస్తే పవన్ని ఓడిస్తామని సందీప్ రాయల్ స్పష్టం చేస్తున్నారు. తన కుటుంబానికి పవన్ కళ్యాణ్ నుంచే హాని ఉందని ఏమైనా జరిగితే ఆయనదే బాధ్యత అంటూ హాట్ స్టేట్మెంట్ ఇచ్చేశారు.
ఇవన్నీ పక్కన పెడితే ఎవరీ రుక్మిణి ఎందుకు జనసైనికులకు పవన్ కి మధయ్న గ్యాప్ కి ఆమె కారణం అవుతోంది అన్నది కూడా చర్చకు వస్తోంది. ఆమె ఎన్నారై అని అంటున్నారు. ఆమె అమెరికా నుంచి కేవలం జనసేన పటిష్టత కోసమే గత ఏడాది హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారని చెబుతున్నారు. ఆమెకు జనసేనలో టాప్ లెవెల్ ప్రయారిటీ దక్కుతోందని అంటున్నారు.
ఆమె వచ్చాక మొత్తం సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారిలో చాలా మందిని మార్చేశారు అని అంటున్నారు. అలాగే మంగళగిరి పార్టీ ఆఫీసులో కూడా చాలా మందిని మార్చారని అంటున్నారు. ఆమె పార్టీని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని ఒక వర్గం అంటూంటే ఆమె వల్లనే పార్టీ ఇబ్బందులో పడుతోందని బయటకు వచ్చిన సందీప్ రాయ్ లాంటి వారు అంటున్నారు. ఏది ఏమైనా జనసేనలో పవన్ కళ్యాణ్ మీద బయటకు వస్తున్న వారు విమర్శలు చేస్తున్నారు. మాటలతో మంటలు రేపుతున్నారు. ఎన్నికల వేళ ఇలాంటి పరిణామాలు ఇబ్బందిగానే ఉంటాయి. మరి దీనిని చక్కదిద్దే పరిస్థితి ఉందా లేదా అన్నది చూడాల్సి ఉంది.